Tuesday, November 26, 2024

సొరంగంలో వరద నీరు.. 13 మంది మృతి

చైనాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదల కారణంగా నిర్మాణ పనులు కొనసాగుతున్న ఓ సొరంగంలో చిక్కుకున్న 13 మంది కార్మికులు మృతిచెందారు. ఝుహాయ్​ నగరం జింగ్యే ఎక్స్​ప్రెస్​వేలోని షిజింగ్​షాన్​ సొరంగంలో ఈ ఘటన జరిగింది. జులై 15న మొత్తం 14 మంది కార్మికులు ఈ సొరంగంలో చిక్కుకున్నారు. ఇప్పటివరకు 13 మంది మృతదేహాలను వెలికితీశారని ప్రభుత్వ మీడియా​ తెలిపింది. మరో కార్మికుడి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పింది.

మరోవైపు చైనాలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. హెనాన్‌ ప్రావిన్స్‌లో గత 1000ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కుంభవృష్టి కురవడంతో భీకర వరదలు సంభవించాయి. ఫలితంగా 25 మంది చనిపోగా.. మరో ఏడుగురు గల్లంతయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement