Friday, November 22, 2024

TS | రేపటికి డెడ్‌లైన్‌.. జేపీఎస్‌లు డ్యూటీకి రాకుంటే కొత్త‌వారికి చాన్స్‌

జూనియ‌ర్ పంచాయతీ కార్య‌ద‌ర్శ‌లు విష‌యంలో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రేపు మ‌ధ్యాహ్నానికి డెడ్‌లైన్ విధించింది. అయినా డ్యూటీకి రాకుంటే వారి ప్లేసులో కొత్త‌వారిని తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్లు, జిల్లా పంచాయ‌తీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈమేర‌కు జిల్లా కలెక్టర్లతో ప్ర‌భుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి ఇవ్వాల (శుక్ర‌వారం) సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా ప్ర‌భుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శి జేపీఎస్ అనధికార గైర్హాజరు నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పై
అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రేపు (శనివారం) మధ్యాహ్నం 12.00 గంటల లోగా విధులకు హాజరైన సెక్రెటరీల జాబితా పంపాలని జిల్లా కలెక్టర్ లు, dpo లను ఆదేశించారు. సెక్రెటరీలు విధుల్లో చేరకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ లకు ప్ర‌భుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి సూచించారు. ఏ గ్రామంలోనైతే సెక్రెటరీ లు విధులకు హాజరు కాలేరో సదరు సెక్రటరీల స్థానంలో అదే గ్రామానికి చెంది, డిగ్రీ పూర్తి చేసి , కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారిని కొత్త సెక్రెటరీలుగా తాత్కాలిక ప్రాతిపదికన నియమించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement