Friday, November 22, 2024

Breaking: మధ్యాహ్న భోజనంలో బల్లి.. 25 మంది విద్యార్థులకు అస్వస్థత..

మధ్యాహ్న భోజనంలో చనిపోయిన బల్లి రావడంతో విద్యార్థులంతా ఆందోళన చెందారు. అయితే ఓ విద్యార్థినికి భోజనం వడ్డించే క్రమంలో తన ప్లేట్లో చనిపోయిన బల్లిపడడమే దీనికి కారణంగా మారింది. ఆ స్టూడెంట్ తినడానికి ముందే మరో 25 మంది విద్యార్థులు ఆ భోజనాన్ని తినేశారు. ఈ ఘటన బీహార్‌ రాష్ట్రం ఛప్రాలోని ప్రభుత్వ పాఠశాలలో ఇవ్వాల (బుధవారం) జరిగింది. ఛప్రా సిటీ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఆజాద్ చంద్రశేఖర్ మిడిల్ స్కూల్‌లో ఒక NGO ద్వారా మిడ్ డే మీల్స్ అందిస్తున్నారు.

కాగా, ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్సిపాల్ అనిల్ కుమార్ వెంటనే సివిల్ సర్జన్‌కి, సిటీ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఆసుపత్రికి చెందిన వైద్యుల బృందం పాఠశాలకు చేరుకుని చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. చిన్నారులను పరీక్షించిన వైద్యులకు వారి శరీరంలో విషపు ఆనవాళ్లు ఏవీ కనిపించలేదు. ఆహారం తిన్న తర్వాత పిల్లలకు కొద్దిగా వికారంగా అనిపించింది. ఫుడ్ సేఫ్టీ అధికారి భోజనం నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement