రాజస్థాన్ లోన కరౌలిలో మత ఘర్షణలు చెలరేగాయి. ఆగ్రహించిన యువకులు షాపులు, బైకులకు నిప్పంటించారు. ఉద్రిక్త పరిస్థితులను నియంత్రించేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. 50 మంది ఆఫీసర్లు సహా 600 మంది పోలీసు సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జైపూర్ కు 170 కిలోమీటర్ల దూరంలో కరౌలి ఉంటుంది. ఈ దాడిలో 42 మంది గాయపడినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో చాలా మందికి స్వల్ప గాయాలు కాగా, ప్రాథమిక చికిత్స తర్వాత ఇంటికి పంపించేశారు. ఒకరి పరిస్థితి విషయంగా ఉన్నట్టు చెప్పారు. నిందితులను త్వరగా పట్టుకుని, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం గెహ్లాట్ ఆదేశించారు. ‘‘కొందరు చొరబాటుదారులు అక్కడికి ప్రవేశించారు. వారు ఏ మతం, ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే వీటిని నివారించాలి. ఎందుకంటే వారికేమీ నష్టం కలగదు. సామాన్యులకే నష్టం’’అని గెహ్లాట్ పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement