Friday, November 22, 2024

తొమ్మిదేళ్ళ చిన్నారి క‌డుపులో మృత శిశువు .. ఏం చేశారంటే ..

క‌డుపునొప్పితో బాధ‌ప‌డుతుంది ఓ చిన్నారి..అదీ కూడా పుట్టిన‌ప్ప‌టి నుంచి ఇదే బాధ‌. డాక్ట‌ర్ల‌కి చూపించినా త‌గ్గ‌లేదు..చిన్నారి పెరుగుతున్న కొద్దీ క‌డుపునొప్పి తీవ్ర‌త కూడా పెరుగుతూ వ‌స్తుంది. లాభం లేద‌ని సోనోగ్ర‌ఫీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా షాక్ అయ్యే విష‌యం తెలిసింది. ఆమె కడుపులో పెరుగుతున్నది గడ్డ కాదని తల, కాళ్లు, చేతులు, కళ్ళు ఉన్న మృత శిశువు అని తేల్చారు. ఈ సంఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఖుషీన‌గ‌ర్ లో చోటు చేసుకుంది. ఇప్పుడా చిన్నారికి 9సంవ‌త్స‌రాలు. ఎంత‌కీ క‌డుపునొప్పి త‌గ్గ‌క‌పోవ‌డంతో ముంబైలోని సీయాన్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. బాలిక పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వైద్యులు స‌ర్జ‌రీ చేసేందుకు ముందుకు వచ్చారు. తీవ్రంగా శ్రమించి.. విజయవంతమయ్యారు. ఎట్టకేలకు చిన్నారి కడుపులోని మృత శిశువును బయటకు తీశారు. ఇటువంటి అరుదైన సందర్భాల్లో బిడ్డ పుట్టే అవకాశాలు చాలా తక్కువ అని వైద్యులు తెలిపారు. ఈ పరిస్థితిని మొదట్లోనే కనుగొనవచ్చని శస్త్రచికిత్సకు నేతృత్వం వహించిన డాక్టర్ పరాస్ కొటారి తెలిపారు.

చిన్నప్పటి నుంచే కడుపునొప్పితో బాధపడుతున్న బాలికకు మెరుగైన వైద్యం అందించకుండా.. మూఢనమ్మకాల వల్ల చిన్నారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టార‌ని అన్నారు. ప్రస్తుతం ఆపరేషన్ విజయవంతం అయింది. బాలిక తన జీవితాన్ని తోటివారిలాగే కొనసాగిస్తుంద‌ని డాక్టర్ జోషి స్పష్టం చేశారు. ఉత్తమమైన పీడియాట్రిక్ బృందం వల్లే ఈ ఆపరేషన్ సాధ్యమైందన్నారు. వైద్య చరిత్రలో ఇలాంటి సంఘటలను అరుదుగా జరుగుతుంటాయి. కవలలుగా ఉన్న పిల్లలు తల్లి గర్భంలోనే కలిసిపోవడం, లేదా ఓ శిశువు రూపుదిద్దుకునే క్రమంలోనే మరో శిశువులోకి వెళ్లిపోవడం లాంటి వాటి వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. అయితే ఇలాంటి వాటిని మొదట్లోనే గుర్తిస్తే ప్రాణాలకు ప్రమాదం ఉండదు. కానీ గుర్తించకపోతే ప్రాణాలకే ప్రమాదంగా పరిణమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ తొమ్మిదేళ్ల చిన్నారి కేసులోనూ ఇదే జరిగింద‌ని తెలిపారు వైద్యులు. ఏది ఏమ‌యినా చిన్నారి ప్రాణాలను ఆప‌రేష‌న్ చేసి కాపాడ‌గ‌లిగారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement