Tuesday, November 26, 2024

డీసీజీఐ కీల‌క నిర్ణ‌యం – కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్ల విక్ర‌యాల‌కి ప‌ర్మిష‌న్

డ్ర‌గ్ కంట్రోల‌ర్ సంస్థ డీసీజీఐ కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకుంది. కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్ల మార్కెటింగ్ విక్ర‌యాల‌కి అనుమ‌తిని ఇచ్చింది. మెడిక‌ల్ స్టోర్ల‌లో వ్యాక్సిన్లు అందుబాటులో ఉండ‌వ‌ని, హాస్ప‌ట‌ల్స్, క్లీనిక్ లు వ్యాక్సిన్ ల‌ను కొనుగోలు చేయొచ్చ‌ని వెల్ల‌డించింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మొదలైనప్పటి నుంచి ప్రజలకు ఎక్కువగా కోవీషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లను ఇస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు వ్యాక్సిన్లు కరోనాపై సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పలు అధ్యయనాలు తెలియజేశాయి. కోవీషీల్డ్ ను పూణేలోని సీరం ఫార్మా సంస్థ తయారు చేస్తుండగా… కోవాగ్జిన్ ను హైదరాబాద్ బేస్డ్ భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తోంది. ఈ మేర‌కు టీకా డేటా ప్ర‌తి ఆరు నెల‌ల‌ల‌కి డీసీజీఐకి వెల్ల‌డించాల‌ని తెలిపింది. కోవిన్ యాప్ లో కూడా డేటా అప్‌డేట్ చేయాలనే షరతులును విధించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement