Tuesday, November 26, 2024

కరోనాకు కొత్త వ్యాక్సిన్​, ఆమోదించిన డీసీజీఐ.. అత్యవసర ఉపయోగానికి కోవోవ్యాక్స్​కి పర్మిషన్​

కరోనాపై పోరాటంలో  భాగంగా దేశీయంగా డెవలప్​ చేసిన భారత మొట్టమొదటి mRNA వ్యాక్సిన్​ని డ్రగ్స్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా (DCGI) ఆమోదించింది. ఈ వ్యాక్సిన్‌ను పూణేలో ఉన్న జెనోవా బయోఫార్మాస్యూటికల్స్ తయారు చేసింది. 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు వారికి అత్యవసర ఉపయోగం కోసం ఈ వ్యాక్సిన్​ని రూపొందించారు.  అయితే.. ఇతర కరోనా వ్యాక్సిన్​లను జీరో డిగ్రీస్​ వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది.. కానీ, Gennova తయారు చేసిన ఈ mRNA వ్యాక్సిన్‌ని మాత్రం 2-8 డిగ్రీల వద్ద నిల్వ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

అంతేకాకుండా సీరం ఇనిస్టిట్యూట్​ తయారు చేసిన కోవావాక్స్​ని 7 నుంచి 11 ఏళ్ల మధ్యగల పిల్లలకు అత్యవసర ఉపయోగం కోసం కొన్ని షరతులకు లోబడి వాడొచ్చని డ్రగ్ రెగ్యులేటరీ తెలిపింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CSDCO) యొక్క COVID-19పై సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ 7 నుండి 11 సంవత్సరాల వయస్సు గల కోవోవాక్స్ కు, 18 సంవత్సరాలకు జెనోవా యొక్క రెండు డోస్ m-RNA వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగ అధికారాన్ని మంజూరు చేయాలని సిఫార్సు చేసిన తర్వాత DCGI ఆమోదం పొందినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ)లోని గవర్నమెంట్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ మార్చి 16న డీసీజీఐకి దరఖాస్తు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. నిపుణుల కమిటీ ఏప్రిల్‌లో జరిగిన చివరి సమావేశంలో దరఖాస్తుపై పూణేకి చెందిన సంస్థ నుండి మరింత డేటాను కోరింది. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (DBT), దాని PSU, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (BIRAC) సహకారంతో జెనోవా mRNA వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement