Friday, November 22, 2024

తెలుగురాష్ట్రాల్లో మొదలైన ఎండలు… వేసవి కాలం వచ్చేసింది!

తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే వేసవి కాలం ప్రారంభమవుతున్నట్లే కనిపిస్తోంది.  నిన్నమొన్నటి వరకు చలి తీవ్రతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే, ఇప్పుడు క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలోని తిరుపతిలో నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 37.1 డిగ్రీలుగా నమోదయింది. కర్నూలు, అనంతపురం పట్టాణాల్లో 36.6 డిగ్రీలు, కడపలో 36.2 డిగ్రీలు, తునిలో 36.1 డిగ్రీలు, ఒంగోలులో 35.7 డిగ్రీలు, అమరావతిలో 35.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇక, తెలంగాణలో సైతం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. హైదరాబాదులో గరిష్ఠ ఉష్ణోగ్రత 34 డిగ్రీలుగా నమోదైంది. పలు పట్టణాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. త్యల్పంగా ఆదిలాబాద్ లో 10 డిగ్రీలు, నిర్మల్ లో 12.3 డిగ్రీలు, సంగారెడ్డిలో 13.5 డిగ్రీలు, నిజామాబాద్‌లో 13.5 డిగ్రీలు, రంగారెడ్డిలో 13.8 డిగ్రీలు, జగిత్యాలలో 14.3 డిగ్రీలు, మెదక్‌లో 15 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు  అయ్యాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మార్చి తొలి వారంలోనే ఎండలు మండేలా కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement