వరుసగా నాలుగవరోజు భారీ లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్స్. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు క్రమంగా పెరుగుతూనే వచ్చాయి. విదేశీ ఇన్వెస్టర్లు సైతం కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు కళకళలాడాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 418 పాయింట్లు లాభపడి 60,260కి చేరుకుంది. నిఫ్టీ 119 పాయింట్లు పెరిగి 17,944కి ఎగబాకింది. ఆటో, కన్జ్యూమర్ గూడ్స్ సూచీలు మినహా ఇతర సూచీలన్నీ లాభాలను మూటకట్టుకున్నాయి. బజాజ్ ఫిన్ సర్వ్ (5.74%), బజాజ్ ఫైనాన్స్ (3.28%), భారతి ఎయిర్ టెల్ (2.55%), టెక్ మహీంద్రా (2.45%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.22%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా మిగిలాయి. మహీంద్రా అండ్ మహీంద్రా (-1.07%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.65%), మారుతి (-0.58%), టాటా స్టీల్ (-0.44%), కొటక్ బ్యాంక్ (-0.33%) టాప్ లూజర్స్ గా నిలిచాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement