Tuesday, November 26, 2024

ద‌స‌రా.. హిట్టా..ఫ‌ట్టా.. రివ్యూ

ఈ శ్రీరామ‌న‌వ‌మికి ద‌స‌రా చిత్రం ప్రేక్ష‌కుల‌ముందుకు వ‌చ్చింది.భావోద్వేగాలతో కూడిన యాక్షన్‌తో కూడిన ఎంటర్‌టైనర్ ఇది. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో హీరో నాని..హీరోయిన్ కీర్తిసురేశ్ లు మాస్ లుక్ లో అల‌రించారు.మ‌రి ఈ చిత్రం వీరికి విజ‌యాన్ని అందించిందా లేదా ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

క‌థ ఏంటంటే.. 1995 లో తెలంగాణా లోని వీరపల్లి అనే గ్రామంలో జరిగే ఈ కథ ఆనాటి రాజకీయ,సాంఘక,సాంస్కృతిక పరిస్దితులను పరిచయం చేయటంలో మొదలవుతుంది. ధరణి (నాని),సూరి(దీక్షిత్ శెట్టి) ఇద్దరూ అదే ఊరికి చెందిన జాన్ జిగిరీ దోస్త్ లు. వాళ్లిద్దరూ ఒకే అమ్మాయి వెన్నెల(కీర్తి సురేష్) తో ప్రేమలో పడతారు. తన ప్రెండ్ సూరి కూడా అదే అమ్మాయిని ప్రేమిస్తున్నాడనే విషయం తెలుసుకున్న ధరణి త్యాగం చేసి తప్పుకుంటాడు. సూరికి, వెన్నెలకు పెళ్లి అవుతుంది. అయితే అంతా సుఖంగా,ఆనందంగా నడిస్తే అది కథ ఎందుకు అవుతుంది. వాళ్ల జీవితాల్లోకి ఊరి సర్పంచ్ నంబి (షైన్ టామ్ చాకో) వస్తాడు. మరో ప్రక్క శివన్న(సముద్ర ఖని), రాజన్న(సాయికుమార్) రాజకీయం ఆడుతూంటారు. అక్కడ నుంచి ప్రశాంతంగా నడుస్తున్న వాళ్ల జీవితా లు వేరే టర్న్ లు తీసుకుంటాయి. ఊహించని ఓ సంఘటనతో మొత్తం మారిపోతుంది. ధరణి వైల్డ్ గా మారతాడు. అందుకు దారి తీసిన సంఘటనలు ఏమిటి..అసలు ఏం జరిగింది… చివరకు ఏమైంది అనేది మిగతా కథ.

- Advertisement -

విశ్లేషణ.. ప్రేమ, ప్రెండ్షిప్, పాలిటిక్స్ ఈ ఎలిమెంట్స్ ద‌స‌రా సినిమాలో ప్రధానం. ధరణి, వెన్నెల,సూరి ఈ మూడు పాత్రలు ఈ సినిమాలో కీలకం. ఈ పాత్రలు, ఈ బేసిక్ ఎమోషన్స్ చుట్టూనే కథ,కథనం రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు. అయితే కథ కొత్తగా అనిపించదు. కథనం అంతకన్నా రొటీన్ గా ఉంటుంది. ముఖ్యంగా కాంప్లిక్ట్ పాయింట్ రైజ్ చేసి కథనాన్ని పరుగెత్తించే విలన్ పాత్ర బలంగా ఉండదు. ఫలానా వాడు విలన్…అతనే సమస్యలకు మూలం అని హీరో కు తెలిసే సరికే కథ ఇంటర్వెల్ దాటేస్తుంది. అలాగే విలన్ ఎందుకోసం ఇదంతా చేస్తున్నాడనే కారణం రివీల్ అయ్యేసరికే సెకండాఫ్ సగం దాటిపోతుంది. అలా కథలో ఏదైతో కాంప్లిక్ట్ పాయింట్ ఉందో దాన్ని చెప్పకుండా ఇంటర్వెల్ సర్పైజ్ కోసం దాటి పెట్టడంతో బోర్ కొట్టేస్తుంది. పోనీ విషయం తెలిసాక అయినా హీరో ఎప్పుడు రైజ్ అవుతాడా అని ఎదురుచూడాల్సిన సిట్యువేషన్. అంత పవర్ ఫుల్ గా చెప్పబడే విలన్ సైతం అవకాసం కోసం ఎదురుచూస్తూ కాలక్షేపం చేస్తూంటాడు తప్పించి ముందుకు వెళ్లడు. విలనే ఖాళీగా ఉన్నప్పుడు హీరోకు ప్రత్యేకంగా పనే ముంటుంది. ఇద్దరు క్లైమాక్స్ కోసం ఎదురుచూడ్డం తప్పించి. మొత్తం కథ స్పీడుగా చెప్తే ఓ నలభై నిముషాలు కూడా రాదని పిస్తుంది. చాలా స్లో నేరేషన్ ఒక్కో అడుగు వేసుకుంటూ కథను నేరేట్ చేసాడు దర్శకుడు.


ఫస్టాఫ్ లో వీరపల్లి విలేజ్ ని ఎంతలా రిజిస్టర్ చేస్తారంటే మనకు ఆ ఊరు ఇంతకు ముందే పరిచయం ఉందేమో అనిపించేలా. డైరక్టర్ కు ఇక్కడ బాగా సక్సెస్ అయ్యారు. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఊహించగలిగేదే అయినా మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. సెకండాఫ్ పై అంచనాలు పెంచేస్తుంది. థియేటర్ కు వెళ్లేముందు మనం సినిమాపై ఏ స్దాయి అంచనాలు పెట్టుకున్నామో అంతకు రెట్టింపు ఇక్కడ ఎక్సపెక్ట్ చేసేలా చేస్తుంది. అయితే సెకండాఫ్ ని ఆ స్దాయిలో సస్టైన్ చేయలేకపోయారు. ట్విస్ట్ లు, టర్న్ లు, సర్పైజ్ లు,సస్పెన్స్ ఎలిమెంట్స్ లేకుండా ప్లాట్ గా నడుస్తూంటుంది. ఫస్టాఫ్ లో ఉన్న ఎక్సైట్మెంట్ ఇక్కడ మనకు కనపడదు. నిజానికి సెకండాఫ్ లో డ్రామా వేడెక్కి నెక్ట్స్ లెవిల్ కు వెళ్లాలి. కానీ అది జరగదు.

నటీన‌టుల న‌ట‌న‌.. నాని పక్కా మాస్ లుక్స్‌తో తన విశ్వరూపం చూపించాడు. వెన్నెలగా నటించిన కీర్తి సురేశ్, విలన్‌గా చేసిన మలయాళ నటుడు షైన్ చాకో పాత్రల్లో పోటీపడ్డారు. కీర్తి సురేష్ లో ఇంత మంచి నటి ఉందని ..మహా నటి తర్వాత మళ్లీ మనకు అనిపిస్తుంది. వెన్నెల లాంటి ప్రేయసి మనకూ ఉండాలి, చాకో ని మనమూ కొట్టాడాలని ప్రేక్షకులు కదిలిపోయేలా తెరకెక్కించారు. ధరణికి స్నేహితుడిగా నటించిన కన్నడ యాక్టర్ దీక్షిత్ శెట్టికి కూడా సహజంగా చేసుకుంటూ పోయాడు. సాయికుమార్, ఝాన్సీ సపోర్టింగ్ పాత్రల్లో ఓకే. సముద్ర ఖని పాత్ర ఎందుకనో అసమగ్రంగా ఉంది. ఓవ‌రాల్ గా సినిమా జ‌యాప‌జ‌యాలు ప్రేక్ష‌కులు చూసే తీరు..ఇచ్చే తీర్పుని బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే.

టెక్నీషియ‌న్స్.. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ గ్యాప్ తర్వాత చేసిన తెలుగు సినిమా. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ నేచురల్ గా,ప్రెష్ గా ఉండేలా చూసుకున్నాడు. . ధూమ్‌ధామ్ దోస్తాన్, చమ్కీల అంగీలేసి, ఓరి వారి పాటలు బాగున్నాయి. అయితే అక్కడక్కడా తమిళ ప్లేవర్ అక్కడక్కడా మెరిసింది. సత్యన్ సూర్యన్ కెమెరా వర్క్ బ్రిలియెంట్ అని చెప్పాలి. ఈ సినిమా కష్టంలో సింహభాగం అతనిదే. సినిమాకు తగ్గ రా టోన్ ని సెట్ చేయటంలో కెమెరా వర్క్ ప్రధాన పాత్ర వహించింది. నవీన్ నూలి ఎడిటింగ్ కొంత బోర్ ని,స్లో ని తగ్గిస్తే బాగుండేది. రైటింగ్ సైడ్ చూస్తే డ్రామా పండించే దిసగా సక్సెస్ అయ్యారు కానీ సినిమా కథకు ఉండాల్సిన కొన్ని ఎలమెంట్స్ ని,సర్పైజ్ లను వదిలేసారు. అయితే లోకల్ ప్లేవర్ ని తీసుకురావటంలో మాత్రం వందశాతం సక్సెస్ అయ్యారు. యాక్షన్ కొరియోగ్రఫీ ఈ సినిమాలో మరో హైలెట్ గా ఉన్న డిపార్టమెంట్. డైలాగులు ఒరిజనల్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే నాని రెగ్యులర్ సినిమాకి ఇది నెక్ట్స్ లెవిల్.

Advertisement

తాజా వార్తలు

Advertisement