దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం డేంజరస్ను ప్రదర్శించేందుకు పీవీఆర్ సినిమాస్,.ఐనాక్స్ సినిమాస్ తిరస్కరించాయి. ఈ విషయాన్ని స్వయంగా వర్మనే ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇద్దరు మహిళల మధ్య స్వలింగ సంపర్కం నేపథ్యంలో డేంజరస్ చిత్రాన్ని వర్మ రూపొందించారు. నైనా గంగూలీ, అప్సరా రాణి ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ప్రదర్శించలేమంటూ పీవీఆర్ సినిమాస్,.ఐనాక్స్ సినిమాస్ తేల్చిచెప్పేశాయి. తన సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి అనుమతి లభించిన అంశాన్ని ప్రస్తావించిన వర్మ… ఈ రెండు సినిమా థియేటర్లు తన సినిమా ప్రదర్శనకు తిరస్కరించి స్వలింగ సంపర్కులను అవమానించాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
రామ్ గోపాల్ వర్మకి షాక్ – డేంజరస్ పై నిషేధం విధించిన పీవీఆర్, ఐనాక్స్ సినిమాస్
Advertisement
తాజా వార్తలు
Advertisement