తెలంగాణ రాష్ట్రంలో గత ఐదు రోజులకు పైగా భీకర వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని చెరువులు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నాయి. పలు గ్రామాలు నీట మునిగిపోయాయి. అయితే రాష్ట్రంలోని కడెం ప్రాజెక్ట్ డేంజర్ జోన్ లో ఉంది. కడెం ప్రాజెక్ట్ కు వరద పోటెత్తుతోంది. సామర్థ్యానికి మించి ప్రాజెక్ట్ లోకి వరద నీరు చేరుతోంది. కడెం ప్రాజెక్టు సామర్థ్యం 3లక్షల క్యూసెక్కులు కాగా.. కడెం ప్రాజెక్ట్ లోకి 5లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో 25 గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. 1995 తర్వాత అత్యధిక స్థాయిలో వరద రావడం ఇదే ప్రథమం.
Advertisement
తాజా వార్తలు
Advertisement