Tuesday, November 26, 2024

డ్యామ్ లు డొల్ల‌!

పూడికలతో అవక్షేపణ దశకు చేరిక
తగ్గుతున్న నీటినిల్వ సామర్థ్యం
2050 నాటికి నాలుగోవంతు నష్టం
యూఎన్‌ పరిశోధకుల అధ్యయనం

న్యూఢిల్లి: ప్రపంచంలోని నీటి ఆనకట్టల పరిస్థితి దయనీ యంగా మారుతోందని యుఎన్‌ పరిశోధకులు హెచ్చరిస్తున్నా రు. వివిధ దేశాల్లోని వేలకొద్దీ పెద్ద డ్యామ్‌లు అవక్షేపంతో పూడి పోతున్నాయని, 2050 నాటికి వాటి నిల్వ సామర్థ్యంలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ నష్టపోయే ప్రమాదం ఉందని, నీటి భద్రతకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. నీరు, పర్యావరణం, ఆరోగ్యం కోసం యుఎన్‌ విశ్వవిద్యాల యానికి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఈమేరకు ఒక కొత్త అధ్యయనం విడుదల చేసింది. ఈ శతాబ్దం మధ్య నాటికి, ఆనకట్టలు, రిజర్వాయర్లు 1.65 ట్రిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీటినిల్వ సామ ర్థ్యాన్ని అవక్షేపంగా కోల్పోతాయి. ఈ సంఖ్య సంయుక్త వార్షిక నీటి వినియోగానికి దగ్గరగా ఉంది. భారతదేశం, చైనా, ఇండోనేషియా, ఫ్రాన్స్‌, కెనడాలకు డ్యామ్‌లు కీలకమైనవి. ఈ పెద్ద డ్యామ్‌లు ప్రపంచవ్యాప్తంగా జలవిద్యుత్‌, వరద నియం త్రణ, నీటిపారుదల, తాగునీటి ప్రయోజనాలకు అతి ముఖ్యమై నవి అని నివేదిక విశ్లేషించింది.

మేలుకోకుంటే ముప్పే..
భవిష్యత్‌లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయే ప్రమాదం అనే ది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని అధ్యయనం స#హ రచయిత, ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ వ్లాదిమిర్‌ స్మాఖ్టిన్‌ చెప్పారు. పరిశోధకులు 150 దేశాలలో దాదాపు 50,000 పెద్ద డ్యామ్‌లు, రిజర్వాయర్లను పరిశీలించారు. అవి ఇప్పటికే 16శాతం నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయాయని కనుగొన్నారు. శతాబ్దం మధ్య నాటికి అది దాదాపు 26శాతానికి పెరుగుతుందని వారు అంచనా వేశారు. నదులు స#హజంగా చిత్తడి నేలలు, తీర ప్రాం తాల నుంచి అవక్షేపాలను ఆనకట్టల్లోకి చేర్చుతుంటాయి. కాల క్రమేణా ఈ బురద నిక్షేపాల నిర్మాణం నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గిస్త్తుంది. ఇది భవిష్యత్తులో చాలా మందికి నీటి సరఫరా భద్రతను ప్రమాదంలో పడేస్తుంది. అలాగే నీటిపారుదల, విద్యుత్‌ ఉత్పత్తికి విఘాతంగా మారుతుంది. పూడిక ముప్పు వరదలకు దారితీస్తుంది. ఇలాంటి ప్రతికూల పరిణామాలు దిగువన ఉన్న వన్యప్రాణుల ఆవాసాలు, తీరప్రాంత జనాభాపై ప్రభావం చూపుతుంది.

అవక్షేపణ అతిపెద్ద సమస్య
2050 నాటికి, 10,000 పెద్ద ఆనకట్టలు వాటి జీవితకాల ముగింపునకు చేరుకుంటాయి. వీటిలో కొన్ని ఆ దశను కూడా దాటేస్తాయి. ప్రపంచంలోని 60,000 పెద్ద ఆనకట్టలు 1930 -1970 మధ్య నిర్మించబడ్డాయి. 50 నుండి 100 సంవత్సరాల వరకు ఉండేలా వీటికి డిజైన్‌ చేశారు. ఆ తర్వాత అవి విఫలమ య్యే ప్రమాదం ఉంది. ఇవి కూలిపోతే దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రపంచ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది ప్రభావితం అవుతారు. పెద్ద ఆనకట్టలు, రిజర్వాయర్‌లు 15 మీటర్లు (49 అడుగు లు) కంటే ఎత్తుగా లేదా కనీసం ఐదు మీటర్ల ఎత్తులో 3 మీ క్యూబిక్‌ మీటర్ల కంటే తక్కువ నీటిని నిలుపుకుంటాయి. గ్లోబల్‌ వార్మింగ్‌ సమ్మేళనాలు పూర్తిగా కొలవలేని మార్గాల్లో ప్రమా దాన్ని కలిగిస్తాయి. వరదలు, కరువు వంటి వాతావరణ మార్పు తీవ్రతలు పెరుగుతాయని స్మాఖ్తిన్‌ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement