Friday, November 22, 2024

బైక్ రైడర్లకు గుడ్ న్యూస్.. డామన్ హైపర్‌ ఫైటర్.. ఎలక్ట్రిక్ సూపర్ నేకెడ్ బైక్ వస్తోంది..

మరో కొత్త ఎలక్ర్టానిక్ బైక్ మార్కెట్లోకి వస్తోంది.. అయితే ఇది అట్లాంటి ఇట్లాంటి బైక్ కాదు.. దీని మోడల్, ధర చూస్తే అబ్బో అనాల్సిందే. అయితే దీనిపై బైక్ రైడర్లు ఇప్పటికే కన్నేశారు. ఎన్నో లేటెస్ట్ ఫీచర్స్ ఉన్న ఈ బైక్ అంటే తెగ మనసు పారేసుకుంటున్నారు. మరి ఆ బైక్ ఏంటి.. దాని సంగతేంటి అనేది చదివి తెలుసుకుందాం..

కెనడియన్ స్టార్టప్ డామన్ మోటార్స్ లాస్ వెగాస్‌లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES)లో తన అధునాతన మూడు మోడల్స్ ని ప్రదర్శనకు ఉంచింది. వీటిలో హైపర్‌ఫైటర్ అనే బ్రాండ్ రెండో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ లైన్‌ అక్కడికి వచ్చిన వారిని ఎంతో ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ సంస్థ హైపర్‌ఫైటర్ ని 2020లో మొదటిసారిగా ఆవిష్కరించింది. కాగా, ప్రస్తుతం దీన్ని అప్ గ్రేడ్ చేశారు. హైపర్‌ఫైటర్ మూడు ట్రిమ్‌లలో రానుంది. కొలోసస్, అన్‌లిమిటెడ్ 20, అన్‌లిమిటెడ్ 15. బేస్ అన్‌లిమిటెడ్ 15 148 బిహెచ్‌పిని చేస్తుంది, 197 బిహెచ్‌పి, కోలిమిట్ 20తో పోలిస్తే. మూడూ హైపర్‌స్పోర్ట్ యొక్క మోనోకోక్ ఛాసిస్‌ను ఉపయోగిస్తాయి. అయితే ఖరీదైన కొలోసస్ లో ప్రీమియం వీల్స్, సింగిల్-సైడెడ్ స్వింగార్మ్, ఓహ్లిన్స్ సస్పెన్షన్, బ్రెంబో బ్రేక్‌లు ఉన్నాయి.

ప్రతి హైపర్‌ఫైటర్ లో కదిలే వస్తువులను ట్రాక్ చేసేందుకు వీలుగా రాడార్ లు అమర్చారు. కెమెరాలు, సెన్సార్‌లతో పాటు అధునాతన 360-డిగ్రీల యాంగిల్ లో అలర్ట్ చేసే హ్యాండిల్‌బార్లు దీని స్పెషాలిటీ.. విండ్‌స్క్రీన్‌లు కూడా ఉంటాయి. ఇవి పర్సనల్ ఇంపార్టెన్స్ కు అనుగుణంగా ఉంచడానికి వీలుంటుంది. ఈ మూడు మోడల్స్ కూడా దేనికవే ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బైక్ వెనకు నుంచి దగ్గరగా ఏ వేహికల్ వస్తుంది అనే దాన్ని కూడా మానిటర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది.

హైపర్‌ఫైటర్ కొలోసస్ 20 kWh బ్యాటరీని 235 కిమీ పరిధిని అందజేస్తుంది.197 bhp (150 kW) శక్తిని అందిస్తుంది. డామన్ మోటార్స్ ప్రకారం, కొలోసస్ గరిష్టంగా 274 kmph వేగాన్నిఅందుకుంటుంది. కేవలం 3సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని అందుకుంటుంది. కొలోసస్ ధర వింటే భయం పుట్టించేలా ఉంటుంది. $35,000 (సుమారు ₹ 26 లక్షలు). అన్‌లిమిటెడ్ 20, అన్‌లిమిటెడ్ 15 ట్రిమ్‌ల ధర వరుసగా $25,000 (సుమారు ₹ 18.60 లక్షలు), $19,000 (₹ 14.15 లక్షలు)గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement