Tuesday, November 19, 2024

కమిటీల నియామకంపై.. దామోదర రాజనర్సింహ సంచలన వ్యాఖ్యలు…

టీ కాంగ్రెస్‌లో కమిటీల పదవుల విషయం అగ్గి రాజేస్తోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, పీసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ అసంతృప్తితో తమ పార్టీ పదవులకు రాజీనామా చేయగా.. వారి బాటలో మరో సీనియర్ నేత కమిటీల నియామకంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ కమిటీల నియామకం విషయమై తీవ్ర అంతృప్తి వెల్లగక్కారు. లోపం ఎక్కడ జరుగుతుందో పార్టీలో అసలు చర్చ జరగడం లేదని, కమిటీల్లో అనర్హులకు చోటు కల్పించారని విమర్శించారు. బలహీన వర్గాలకు కాంగ్రెస్‌లో గుర్తింపు లేదని, కాంగ్రెస్ సిద్దాంతాలు ఏంటో తెలియని వారికి పదవులు ఇస్తారా ? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలైన కాంగ్రెస్ వాదులకు పార్టీలో తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు.

కాంగ్రెస్‌కు కోవర్ట్ రోగం పట్టుకుందని, పార్టీలోనే ఉంటూ కొందరు కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం ఇప్పటికీ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పాట పాడుతూ కేసీఆర్ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారన్నారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌కు అనుకూలంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయన్నారు. పార్టీలో కోవర్టులకే గుర్తింపు ఉందన్నారు. పార్టీలో ఉండి ఇతరులకు తొత్తులుగా వ్యవహరిస్తారా ? సిద్దిపేట జిల్లాలో కోవర్టులకు మాత్రమే పోస్టులు ఇచ్చారని.. ఎవరి ఇంట్రెస్ట్ ఏంటని తేలాలన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, కాంగ్రెస్‌లో చాలా తప్పులు జరిగాయని దామోదర రాజనర్సింహ మండిపడ్డారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement