Tuesday, November 19, 2024

ఇండియాలో ఉండ‌ట‌మే ఇష్టం.. ‘ద‌లైలామా’

టోక్యో : తాను ఇండియాలోనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు టిబెట్ ఆధ్యాత్మిక గురువు ద‌లైలామా. చైనా సోద‌ర సోద‌రీమ‌ణుల ప‌ట్ల త‌న‌కు ద్వేష‌భావం లేద‌ని తెలిపారు. క‌మ్యూనిజం, మార్కిజ‌మ్ భావాల‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా ఆయ‌న మీడియా స‌మావేశంలో పాల్గొన్నారు. తైవాన్‌కు వెళ్తారా అని అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న బ‌దులిస్తూ.. తాను ఇండియాలోనే ఉండేందుకు ఇష్ట‌ప‌డుతున్న‌ట్లు చెప్పారు. తైవాన్‌, చైనా మ‌ధ్య సంబంధాలు బ‌ల‌హీనంగా ఉన్న నేప‌థ్యంలో అక్క‌డ‌కి వెళ్ల‌లేన‌న్నారు. చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యేందుకు ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లు లేవ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. చైనా నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేసిన దలైలామా.. వాళ్లు విభిన్న సంస్కృతుల్లో ఉన్న తేడా గ‌మ‌నించ‌లేర‌న్నారు. ఆ దేశానికి చెందిన ప్ర‌ధాన హ‌న్ తెగ ఆధిప‌త్యం ఎక్కువ‌గా ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement