పాతరోజుల్లో దొమ్మరి వారని వచ్చేవారు..వారు వీధుల్లో రెండు కర్రలకి తాడు కట్టి వాటిపై నడిచేవారు..సన్నటి గీతలాంటి తాడుపై మనిషి నడవడం అంత ఈజీ ఏం కాదు. కానీ వారు మాత్రం ఆటలాగ ఆడేవారు. అదే వారి టాలెంట్..ఆ విన్యాసాన్ని చూస్తేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంటుంది. అయితే ఇక్కడ ఏకంగా ఆ ఊరిలోని వారంతా తాడుపై అలవోకగా నడుస్తుంటారంటా..రోడ్లు లేవా అనుకుంటున్నారా..అన్నీ వున్నాయండీ కాకపోతే ఇదే అక్కడి వారి టాలెంట్. రష్యాలోని డాగేస్టాన్ అటానమస్ రిపబ్లిక్ పర్వతాల్లోని త్సోవ్క్రా -1 గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. దాదాపు వందేళ్ల నుంచి ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రజలు టైట్ రోప్(తాడు) మీద నడవటం నేర్చుకున్నారు. మహిళలతో సహా ప్రతి ఒక్కరూ ఇక్కడ తాడు మీద నడుస్తారు. ఈ ప్రతిభ వల్ల చాలామందికి సర్కస్‌లో అవకాశాలు లభిస్తున్నాయి. దీంతో ఊరిలో ప్రజలంతా దీనిపై శిక్షణ పొందారు.1980 నుంచి ఇక్కడి ప్రజలు తాడు మీద నడవడంలో శిక్షణ పొందారు. అప్పట్లో సర్కస్‌లో పాల్గొనేందుకు ఈ శిక్షణ పొందేవారు. అది క్రమేనా సాంప్రదాయంగా మారడంతో.. పుట్టిన ప్రతి ఒక్కరికీ తాడుపై నడవడంలో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే, ఇప్పటి తరానికి టైట్ రోప్ మీద ఆసక్తి తగ్గిపోయింది. ఇందులో శిక్షణ పొందేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో భవిష్యత్తులో ఈ గ్రామ సాంప్రదాయం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తులు వాపోతున్నారు.
అప్పట్లో ఈ గ్రామంలో సుమారు 3 వేల మంది నివసించేవారు. రష్యాలోని పలు ప్రాంతాల్లో సర్కస్ సంస్థల్లో అవకాశాలు లభించడం వల్ల ఊరు వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆ గ్రామంలో కేవలం 400 మంది మాత్రమే నివసిస్తున్నారు. వీరందరీకి టైట్ రోప్ మీద నడిచే అనుభవం ఉంది.పర్వతాల్లో తిరిగేందుకు వీలుగా..: త్సోవ్క్రా -1 గ్రామం పర్వతాల మధ్యలో ఉంటుంది. ఒక కొండ మీద నుంచి మరొక కొండ మీదకు వెళ్లేందుకు పూర్వికులు తాళ్లను ఆధారంగా చేసుకొనేవారు. కొండకు కొండకు మధ్య తాడును కట్టి.. దానిపై నడుస్తూ మరోవైపుకు చేరుకొనేవారు. దీంతో ఆ ఊరిలో ప్రజలంతా తాడుపై నడవడాన్ని అలవాటు చేసుకున్నారు. ఆ ప్రతిభ వల్ల సర్కస్‌లో అవకాశాలు లభించడంతో అందరికీ ఆసక్తి పెరిగింది. అయితే, తాడు మీద నడిచే ఈ సాంప్రదాయం కోసం ఒక్కోక్కరూ ఒక్కో కథ చెబుతారు. వంతెనలు కూలిపోతే.. నదులను దాటేందుకు ఈ ప్రతిభ ఉపయోగపడుతుందని అంటారు. కొందరు వ్యవసాయ క్షేత్రాలపై తాడు కట్టుకుని నడుస్తుంటారు. పర్వత ప్రాంతం కావడం వల్ల అక్కడ వ్యవసాయం చేయడం సాధ్యం కాదు. దీంతో కుటుంబాలను పోషించేందుకు ఆ గ్రామంలోని పురుషులు నగరాల్లోకి వెళ్లి టైట్ రోప్ ప్రదర్శనలిస్తూ.. ఉపాధి పొందుతున్నారు. వచ్చేప్పుడు కుటుంబం కోసం ఆహార ధాన్యాలు తీసుకొచ్చేవారట.
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily