టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు, మాజీ పిసిసి అధ్యక్షుడు శ్రీనివాస్ మళ్లీ సొంత గూటికి చేరబోతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని గత కొన్ని రోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన చేరిక వాయిదా పడింది. తాజాగా డీఎస్ కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారు అయింది. జనవరి 24వ తేదీన డీ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయన చేరిక పై ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిగినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని సమాచారం.
కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులుగా డి శ్రీనివాస్ పనిచేశారు. గతలోం వైఎస్ కేబినెట్ లో మంత్రిగా కూడా పని చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తరువాత ఆయన టిఆర్ఎస్ పార్టీలో చేశారు. అనంతరం డిఎస్ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. అయితే, గత కొన్ని రోజుల నుంచి టిఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన బీజేపీలో చేరుతారంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే, డీఎస్ మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే చేరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.