Friday, November 22, 2024

తౌటే తుఫాన్ బీభత్సం కేరళ, కర్ణాటక, గోవాలో భారీనష్టం

అతి తీవ్ర తుఫాన్‌గా మారిన తౌటే తుఫాన్‌… కేరళ, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించింది. భీకరమైన గాలులతో కూడిన కుండపోత వర్షాలకు తీర ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. పెద్ద సంఖ్యలో విద్యుత్తు స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి పలు ప్రాంతాలు చీకట్లో మగ్గుతున్నాయి. కర్ణాటకలో నలుగురు, గోవాలో ఇద్దరు మరణించారు.

రానున్న 24 గంటల్లో తౌటే మరింత తీవ్రరూపం దాలుస్తుందని, మంగళవారం ఉదయం గుజరాత్‌లోని పోర్‌బందర్‌, మహువా మధ్య తీరం దాటుతుందని ఐఎండీ తెలిపింది. ముందుజాగ్రత్తగా గుజరాత్‌లో తీర ప్రాంత జిల్లాల నుంచి లక్షన్నర మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తౌక్టేతో మహారాష్ట్రకూ ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది. 24 గంటల్లో తుఫాన్‌ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని వాతావారణ శాఖ అధికారులు హెచ్చరించారు. రేపటి వరకూ భారీ వర్షాలు కురుస్తాయని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement