Thursday, November 21, 2024

సైబ‌ర్ క్రైం.. పెద్ద ప్లానే ఇది..

ప్ర‌బ‌న్యూస్ : ”హలో సార్‌.. మేము ఎస్‌బీఐ కాల్‌ సెంటర్‌ నుంచి మాట్లాడుతున్నాం.. మీ బ్యాంకు ఖాతా కేవైసీని అప్‌డేట్‌ చేయాలి” అంటూ అచ్చం నిజమైన ఎస్‌బీఐ బ్యాంకు కస్టమర్‌ కేర్‌ లాగే మాట్లాడి, ఖాతాదారులను నమ్మించి, వారి ఖాతా వివరాలు తెలుసుకుని, వాటి ద్వారా బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బును వివిధ ఖాతాల్లోకి మళ్లిస్తూ మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్ల ముఠాను సైబరాబాద్‌ సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ఢిల్లీ కేంద్రంగా కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి, వేలల్లో కస్టమర్లను నమ్మించి వారి నుంచి కోట్లలో మోసాలకు పాల్పడిన 14 మందిని పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. అసలైన ఎస్‌బీఐ కస్టమర్‌ కేర్‌ నుంచే ఫోన్‌ వచ్చినట్లు- భ్రమింపజేసేందు కు స్పూపింగ్‌ యాప్‌ వాడుతున్నారని.. ఈ యాప్‌ వాడకంలో ఫర్మాన్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించాడని పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. 1860 180 1290 అనే నంబరును స్ఫూపిం గ్‌ చేస్తున్నట్లు వివరించారు.

ధనీ, లోన్‌ బజార్‌ పేరుతో రుణాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న మరో ముఠాను కూడా సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు అభిషేక్‌ మిశ్రా నకిలీ యాప్‌ తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. నకిలీ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యాక వ్యక్తిగత వివరాలు తీసుకొని ఆ తర్వాత రుణం మంజూరైనట్లు చెబుతారని.. ప్రాసెసింగ్‌ ఫీజు పేరిట అధిక మొత్తంలో నగదు తీసుకుంటుంన్నారని వివరించారు. ఈ ముఠాలో 14 మందిని అరెస్టు చేసి నిందితుల వద్ద నుంచి 17 స్మార్ట్‌ ఫోన్లు, 20 బేసిక్‌ ఫోన్లు, 3ల్యాప్‌టాప్‌లు, 5 సిమ్‌కార్డులు, 3 ఏటీ-ఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement