రోజు రోజుకి సైబర్ నేరగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఈ నేరాలతో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు నేరగాళ్ళు. పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టిన ఎక్కడో ఒక చోట సైబర్ నేరాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సినిమా తరహాలో అరగంట వ్యవధిలోనే 1.28 కోట్లు కొల్లగొట్టారు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పేమెంట్ గేట్‌వే సంస్థ కార్యాలయంపై సైబర్ నేరగాళ్లు దాడికి తెగబడి కోట్లు కొల్లగొట్టారు. కేవలం అరగంట వ్యవధిలోనే ఖాతా నుంచి రూ.1.28 కోట్లు కొల్లగొట్టారు. ఈ సొమ్మును 8 బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పేమెంట్ గేట్‌వే సంస్థ సీఈఓ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలనే ఈ సంస్థను ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కంపెనీ ఫుల్ అకౌంట్ నుంచి నిత్యం రూ. కోట్ల లావాదేవీలు కొనసాగుతాయి.
లోకల్ టు గ్లోబల్..రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం..ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily