హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ సీపీగా తనకు బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. ఎక్కడైతే చదువుకుని, పెరిగానో అక్కడే సీపీగా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని చెప్పారు.
హైదరాబాద్ లో సైబర్ నేరాలను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలో శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తామన్న సీపీ ఆనంద్.. డ్రగ్స్ కట్టడికి ఇప్పటికే డ్రైవ్ కొనసాగుతోందని తెలిపారు. హైదరాబాద్ లో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి హైకోర్టు సూచనల మేరకు న్యూ ఇయర్ వేడుకల్లో కొన్ని నిబంధనలు తప్పవని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..