Saturday, November 23, 2024

జూన్ నాటికి 20 కోట్ల వ్యాక్సిన్లు సిద్ధం!

దేశంలో కరోనా మహమ్మారి విలయతాడవం చేస్తోంది. సెకండ్​ వేవ్ ​తో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు కరోనా వ్యాక్సిన్​ వేసుకునేందుకు భారీగా ముందుకు రావడంతో కరోనా వ్యాక్సిన్లకు డిమాండ్​ పెరిగింది. దీంతో ఆ డిమాండ్​కు తగ్గట్టు వ్యాక్సిన్​ ఉత్పతి పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ప్రజలకు వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ‌వ్యాక్సిన్ల సేక‌ర‌ణ‌ను ప్ర‌భుత్వం స‌ర‌ళీక‌రించ‌డంతో దేశీ వ్యాక్సిన్ త‌యారీదారులు ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం పెంచేందుకు స‌న్న‌ద్ధ‌మ‌య్యారు. మే 1 నుంచి 18  ఏళ్లు పైబ‌డిన వారంద‌రికీ వ్యాక్సినేష‌న్ కు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తించ‌డంతో వ్యాక్సిన్ త‌యారీని ముమ్మ‌రం చేయాల‌ని ఫార్మా కంపెనీలు క‌స‌ర‌త్తు సాగిస్తున్నాయి. జూన్ నాటికి దేశంలో 20 కోట్ల క‌రోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రానుండ‌గా ప్రైవేట్ మార్కెట్ లో ఒక్కో వ్యాక్సిన్ డోసు రూ వేయి వ‌ర‌కూ ప‌ల‌క‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. త‌యారీ ఊపందుకున్న క్ర‌మంలో జూన్ నుంచి వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రాలు పెర‌గ‌నున్నాయి.

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మంగ‌ళ‌వారం వ్యాక్సిన్ త‌యారీదారుల‌తో మాట్లాడుతూ ఉత్ప‌త్తి సామ‌ర్ధ్యం పెంచాల‌ని కోరిన సంగ‌తి తెలిసిందే. జూన్ నుంచి సీరం ఇనిస్టిట్యూట్, భార‌త్ బ‌యోటెక్ ల వ్యాక్సిన్ల స‌ర‌ఫ‌రాల‌తో పాటు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ల దిగుమ‌తులు ఊపందుకుంటాయ‌ని భావిస్తున్నారు. మ‌రోవైపు వ్యాక్సిన్ త‌యారీదారుల‌తో ధ‌ర‌ల‌పై సంప్ర‌దింపులు జ‌ర‌పాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాలు, ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌ను కోరింది. అంత‌ర్జాతీయ మార్కెట్ లో పోటీకి దీటుగా ఉండేలా ధ‌ర‌లు ఉండాలని వ్యాక్సిన్ త‌యారీదారులు ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement