Friday, November 22, 2024

ప్రజల్లో చైతన్యం కలిగించేలా కర్ఫ్యూ అమలు!

రాష్ట్రంలో కొవిడ్ మార్గదర్శకాలను అమల్లోకి వచ్చాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మొదటి రెండు రోజులు కొవిడ్ మార్గదర్శకాలపై ప్రజల్లో అవగాహన లోపం ఉంటుందన్నారు. ఎవరికీ ఇబ్బందులు పెట్టొద్దని జిల్లా అధికారులను, కలెక్టర్లను ఆదేశించామన్నారు. ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులతో పాటు ముందుగానే నిర్ణయించుకున్న పెళ్లి తదితర కార్యక్రమాల నిర్వహణ, రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేదానిపైనా గైడ్ లైన్స్ ను రూపొందించామన్నారు. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ సాధారణ జీవనానికి ఆటంకం లేకుండా 144 సెక్షన్, మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్నామన్నారు.

కొవిడ్ మార్గదర్శకాలపై జిల్లా అధికారులతో ఏరోజుకారోజు సమీక్షలు చేస్తామన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన సమయాల్లో బ్యాంకలు పనిచేయాలన్నారు. ఎవరికీ ఇబ్బందులు కలుగకుండా ఉండేలా గతంలో మాదిరిగా లాక్ డౌన్ కాకుండా కర్ఫ్యూ అమలు చేస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ పేషంట్లకు ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయల కల్పనపైనా జిల్లా అధికారులతో మాట్లాడి సీఎంకు నివేదిక అందజేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement