Monday, November 18, 2024

ఏపీలో పగటి పూట కూడా కర్ఫ్యూ!

రాష్ట్రంలో కోవిడ్‌–19 నియంత్రణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌పై సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గించడం, బెడ్‌ల కొరత నివారించేందుకు అవసరమైన చర్యలపై సీఎం చర్చించినట్టు తెలుస్తోంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఎల్లుండి (బుధవారం) నుంచి పగటి పూట కూడా కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఇవ్వనున్నారు. 12 గంటల తర్వాత అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఆంక్షలను రెండు వారాల పాటు అమలు చేయనున్నారు. ఆ సమయంలో 144వ సెక్షన్‌ అమలులో ఉండనుంది. కాగా, ఏపీలో ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూ అమలులో ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement