మన సంప్రదాయాలు, ఆచారాలు చాలా గొప్పవి. ఆధునిక జీవనశైలిలో పడి వాటిని కొంతమంది మరిచిపోవచ్చు కానీ, నేటికీ గ్రామాల్లో పాటించేవారు చాలామందే ఉన్నారు. ఏ శుభ కార్యం జరిగినా తెలంగాణలో ఆడపడుచుల కాళ్లకు పసుపు రాసి వాళ్ల దీవెనలు అందుకోవడం ఆనవాయితీ, ఆచారంగా వస్తోంది. కాగా, డైనమిక్ పోలీస్ ఆఫీసర్ సుమతి (ఐపీఎస్) మన కల్చర్, ట్రెడిషన్‌కు సంబంధించి తన ఫీలింగ్స్‌ని ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు. ‘‘వదినమ్మ కాళ్ళకు పసుపు రాస్తే పుట్టింటి నుండి మెట్టినింటికి ”దీర్ఝ సుమంగళీ భవ” అను ఆశీర్వాదం ఆడబిడ్డకు ఇచ్చినట్టే!! తోబుట్టువుల ప్రేమలే నిజమైన ఆభరణాలు!! కాదంటారా??’’ అని ట్విట్టర్ లో పేర్కొంటూ తన ఫొటోలను షేర్ చేశారు..
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..