Tuesday, November 26, 2024

చంద్రుడిపై క్యూబ్ ఆకారంలో మిస్ట‌రీ హ‌ట్.. ఫొటో పంపిన చైనా రోవ‌ర్‌..

చందమామపై ఎన్నో పరిశోధనలు చేసిన అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా (NASA) నిధులు లేక ఆమధ్య సైలెంట్ అయిపోయంది. దీంతో ఆ పరిశోధనల కంటిన్యూ చేస్తోంది చైనా. ఇదివరకు మనకు కనిపించే మూన్ పైకి చేంజ్ 3 (Chang’e-3)ని పంపిన చైనా ఆ తర్వాత మనకు కనిపించని వైపు ఉండే చందమామ పైకి యూటు-2 రోవర్‌ని కూడా పంపింది. ఆ రోవర్ ఇప్పుడు చందమామను పరిశోధిస్తోంది.

మరోవైపు నాసా కూడా చందమామ దగ్గరకు వ్యోమగాముల్ని పంపేందుకు భారీ ప్రాజెక్టు చేపట్టింది. ఇలాంటి సమయంలో యూటు-2 రోవర్ పంపిన ఓ ఫొటో (cube shape on moon) ఇప్పుడు అంద‌రిలో ఆసక్తి క‌లిగిస్తోంది.

2019 నుంచి యుటు-2 రోవర్ చందమామ అటువైపు భాగాన్ని పరిశోధిస్తోంది. తాజాగా ఈ రోవర్ నుంచి వచ్చిన ఓ ఫొటోలో విచిత్రమైన ప్ర‌దేశం కనిపించింది. చందమామకు అటువైపున ఓ క్యూబ్ లాంటి ఇల్లు ఆకారం కనిపించింది. చూడ్డానికి అదో సింగిల్ బెడ్ రూంలాగా ఉంది. ఓ తలుపు కూడా ఉన్నట్లు ఫొటోలో కనిపిస్తోంది. చైనా స్పేస్ ప్రోగ్రామ్‌ని కవర్ చేస్తున్న జర్నలిస్ట్ ఆండ్ర్యూ జోన్స్ శుక్రవారం నుంచి రోవర్‌కి సంబంధించిన అప్‌డేట్స్‌ని ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తున్నారు.

మొదటి ట్వీట్‌లో ఆయన యూటు-2 రోవర్ చంద్రుడిపై తీసిన ఫొటోని షేర్ చేస్తూ అందులో క్యూబ్ షేప్ (Cube shape object) లో ఏదో ఉంది అని తెలిపారు. అది వోన్ కార్మాన్ పగులు లోయలో ఉంది. అది రోవర్‌కి 80 మీటర్ల (262 అడుగులు) దూరంలో ఉంది. ఆయ‌న ట్వీట్‌ని ఇక్కడ చూడండి..

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement