Thursday, November 21, 2024

Aadhaar: పుట్టిన వెంటనే ఆధార్ కార్డులు: తెలంగాణ సీఎస్ కీలక ఆదేశాలు

తెలంగాణలో ఆధార్ కార్డుల జారీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఏటా ఆరు లక్షల మంది చిన్నారులు జన్మిస్తున్నారని, పుట్టిన వెంటనే వారందరికీ ఆధార్ కార్డులు జారీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులును ఆదేశించారు. రాష్ట్రంలో ఐదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డులు జారీ చేయాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు అందచేయడంతో పాటు ఆధార్ కార్డులను వ్యక్తిగత మొబైల్ నేబర్ లకు అనుసంధానం చేయాలని ఆదేశించారు.

రాష్ట్రంలో ప్రతీ ఒకారికి ఆధార్ కార్డుల జారీ, ఆధార్ కార్డులకు మొబైల్ నెంబర్ల అనుసందానంపై సీఎస్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ..రాష్ట్రంలో 0-5  సంవత్సరాల మధ్య వయస్సుగల వారందరికీ ఆధార్ జారీ చేసేందుకు చర్యలు చేపట్టాలని విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికీ ఆధార్ సీడింగ్ కేంద్రాలు లేని మండలాలన్నింటిలో ఆధార్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఐ.టీశాఖ కార్యదర్శిని సీఎస్ ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement