Friday, November 22, 2024

రైతులకు ఫసల్​ బీమా పైసలు ఇయ్యలేం.. సుప్రీం కోర్టుకెళ్లిన బీమా కంపెనీ!

మహారాష్ట్రలోని రైతుల నుంచి దాదాపు 500 కోట్ల దాకా బీమా రూపంలో కట్టించుకున్న బీమా కంపెనీ తీరా పంట దెబ్బతిని రైతులు నష్టపోతే వారికి బీమా చెల్లించడానికి వెనుకంజ వేస్తోంది. దీంతో రైతులు బాంబే హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు 3.5లక్షల మంది రైతులకు బీమా చెల్లించాలని కంపెనీనీ ఆదేశించింది. అయితే ఈ తీర్పును సవాల్​ చేస్తూ బీమా కంపెనీ సుప్రీం కోర్టుకు వెళ్లారు.

2020వ సంవత్సరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు ప్రధాన మంత్రి ఫసల్​ బీమా యోజన (పీఎంఎఫ్​బీవై) కింద నష్టపరిహారం చెల్లించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. బీమా కంపెనీ ఆ మొత్తాన్ని చెల్లించకుంటే.. ఖరీఫ్‌ సీజన్‌ 2020లో సోయాబీన్‌ పంట నష్టపోయిన ఉస్మానాబాద్‌ జిల్లాలోని 3,57,287 మంది రైతులకు పరిహారంరాష్ట్ర ప్రభుత్వమే ఆ మొత్తన్ని చెల్లించాల్సి ఉంటుందని హైకోర్టు తీర్పునిచ్చింది. దీనికి ఆరు వారాల గడువు ఇస్తున్నట్టు  హైకోర్టు పేర్కొంది.

అయితే.. ఈ తీర్పుపై బీమా కంపెనీ అయిన బజాజ్​ అలయాంజ్​ జనరల్​ ఇన్సూరెన్స్​ కంపెనీ సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. దీంతో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కాగా, జూన్ 16 నుండి ఆరు వారాల వ్యవధిలో తన రిజిస్ట్రీలో రూ. 200 కోట్లు డిపాజిట్ చేయాలని న్యాయమూర్తులు జెకె మహేశ్వరి, హిమా కోహ్లీలతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ బీమా కంపెనీని కోరింది.

2020 ఖరీఫ్ సీజన్‌లో భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా సోయాబీన్ రైతులకు పెద్ద ఉపశమనంగా ఔరంగాబాద్‌లోని బాంబే హైకోర్టు సర్క్యూట్ బెంచ్ ఇటీవల బీమా కంపెనీని పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. బీమా సంస్థ తరపున సీనియర్ న్యాయవాది వివేక్ తంఖా, తన్వీ దూబే సహా ఇతర న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఈ తీర్పుపై వాదనలు వినిపించారు.  

బీమా సంస్థ అప్పీల్‌పై నోటీసు జారీ చేస్తున్నప్పుడు.. పిటిషనర్ రూ. 200 కోట్ల మొత్తాన్ని ఆరు వారాల వ్యవధిలో కోర్టు రిజిస్ట్రీలో డిపాజిట్​ చేయాలని ధర్మాసనం తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే దాకా డిపాజిట్ చేసిన మొత్తాన్ని జాతీయ బ్యాంకులో వడ్డీతో కూడిన ఫిక్స్‌ డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టాలని సూచించింది. ఆరు వారాలలోపు మొత్తాన్ని డిపాజిట్ చేయని పక్షంలో కోర్టుకు తదుపరి సూచన లేకుండా స్టే ఆర్డర్  వెకెట్​ అవుతుందని సుప్రీం కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఈ ఆరు వారాల్లోగా తమ సమాధానాలు దాఖలు చేయాలని పిటిషనర్ రైతులు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.

- Advertisement -

ఉస్మానాబాద్‌లోని రైతుల నుంచి ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన కింద బీమా కంపెనీ రూ.500 కోట్లకు పైగా ప్రీమియం పొందినట్లు హైకోర్టుకు నివేదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement