పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి..దాంతో వరదలతో పలు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.కాగా మధ్య ప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయ మయ్యాయి. అయితే నీట మునిగిన శివపురి పాత బస్టాండ్ సమీపంలోని కాలనీ వీధులోకి ఆదివారం ఒక మొసలి వచ్చింది. దీనిని చూసిన స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మాధవ్ నేషనల్ పార్క్ సిబ్బందిని పోలీసులు రప్పించారు. సుమారు గంట సేపు ప్రయత్నించిన తర్వాత ఎనిమిది అడుగుల పొడవున్న ఆ మొసలిని సురక్షితంగా పట్టుకున్నారు. సంఖ్యా సాగర్ సరస్సులో దానిని విడిచిపెట్టారు. భారీ వర్షాలకు వరద ప్రవాహం వల్ల సమీపంలోని కాలువ నుంచి ఆ మొసలి కాలనీలోకి ప్రవేశి ఉంటుందని అధికారులు భావించారు. మరోవైపు నీట మునిగిన కాలనీ వీధిలోకి వచ్చిన భారీ మొసలిని స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో వీడియో రికార్డు చేశారు. దీంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement