హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో దారుణం జరిగింది. ఓ వృద్ధురాలి మర్డర్ కేసుకు సంబంధించిన మిస్టరీని పోలీసులు ఛేదించారు. కేసులో ట్విస్ట్‌ని పోలీసులు బయటపెట్టారు. ఓ ప్రేమజంట తమ ఆర్థిక అవసరాల కోసం ఈ మర్డర్‌కు స్కెచ్ వేసినట్టు దర్యాప్తులో తేలింది.
హయత్‌నగర్‌లో వృద్ధురాలు సత్తెమ్మను గొంతుకోసి చంపిన కేసులో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. గంటల వ్యవధిలోనే మిస్టరీ కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. ప్రియుడు రాకేశ్‌తో కలిసి ప్రియురాలు లలిత ఈ భారీ దోపిడీకి స్కెచ్ వేసింది. సత్తెమ్మను చంపేసి బంగారం ఎత్తుకెళ్లారు. ఇక.. దర్యాప్తు స్పీడప్ చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను ట్రేస్ అవుట్ చేశారు. వారిని విచారించగా అసలు విషయాలు బయటపడ్డాయి. దీంతో నిందితుల నుంచి 23 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.