టీఆర్టీసీ అంటే అందరికీ చులకన అవుతోంది. ఆర్టీసీపై బస్సులపై సెటైర్లు వేయడం, తప్పుడు ప్రచారాలు (యాడ్స్) చేయడం వంటి వాటిపై ఎండీ సజ్జనార్ సీరియస్ యాక్షన్స్ తీసుకుంటున్నారు. మొన్న ఓ యాడ్‌కు సంబంధించి రాపిడో బైక్ కంపెనీతో పాటు యాడ్‌లో నటించిన స్టైలిష్ స్టార్ అల్లూ అర్జున్‌కు లీగల్ నోటీసులు పంపించారు..
అంతేకాకుండా నిన్న ఓ డ్రైవర్‌పై అకారణంగా దాడిచేసి కొట్టిన పోలీసు ఆఫీసర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ స్వయంగా ఆయన ట్విట్టర్లోనే పోస్ట్ చేశారు.