న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఇండియన్ టీమ్‌ను ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI ). స్వదేశంలో జరుగనున్న రెండు టెస్టులకు 16 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను ఈ రోజు వెల్లడించింది. తొలి టెస్టుకు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండని నేపథ్యంలో వైస్ కెప్టెన్ అజింక్య రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పేర్కొంది.
ఇక వైస్ కెప్టెన్‌గా చతేశ్వర్ పుజారా పేరును ప్రకటించింది బీసీసీఐ. మరోవైపు టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు టెస్టులకు విశ్రాంతినిచ్చింది. కాగా ఈ సిరీస్‌తో శ్రేయస్ అయ్యర్ భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
అయితే మూడు టీ20 మ్యాచ్‌ల తర్వాత.. నవంబరు 25 నుంచి డిసెంబరు 7 వరకు టీమిండియా కివీస్‌తో రెండు టెస్టులు ఆడనుంది. ఇక రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో టెస్టు నుంచి అందుబాటులోకి రానున్నట్టు తెలిపింది బీసీసీఐ.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily