న్యూజిలాండ్‌తో రెండు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా కాన్పూర్ గ్రీన్‌పార్క్ మైదానంలో ఫస్ట్ టెస్ట్ మొదటి రోజు కొనసాగుతోంది. తొలి రోజు లంచ్ టైమ్ వరకు భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. 29 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి రహానే సేన 82 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (13) అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు.. అయినా.. యువ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీతో తన సత్తాచాటాడు.
87 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి గిల్ 52 పరుగులు చేశాడు. ఆరంభంలోనే ఇండియా వికెట్ కోల్పోయినా.. చేతేశ్వర్ పుజారా (15) అండతో గిల్ అద్భుతంగా ఆడి భారత ఇన్నింగ్స్ దూకుడు పెంచాడు. పుజారా మాత్రం తనదైన శైలిలో నెమ్మదిగా స్క్రోక్ లు ఇస్తూ ఆడుతున్నాడు.