ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా సెకండ్ టెస్టులో ఆస్ట్రేలియా ఈరోజు విజయం సాధించింది. అడిలైడ్ మ్యాచ్‌లో 275 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి విజయకేతనం ఎగరేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో తన ఆధిక్యాన్ని చాటుకుంది. మార్నస్ లబుషేన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
కాగా, ఫస్ట్ టెస్టులో 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ టీమ్‌పై ఆస్ట్రేలియా జట్టు గెలుపొందింది. కరోనాతో బాధపడుతున్న ఓ వ్యక్తికి సన్నిహితంగా మెలిగిన కారణంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అడిలైడ్ టెస్టుకు దూరం అయ్యాడు. కాగా, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ జట్టును ముందుండి నడిపించాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలి నుంచి ఆధిపత్యం కనబరిచిన కంగారూలు.. విజయం సాధించి ఇంగ్లండ్‌కు చేదు అనుభవం మిగిల్చారు. పర్యాటక జట్టులో డేవిడ్ మలన్, కెప్టెన్ జో రూట్ మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. జోస్ బట్లర్ 207 బంతులు ఎదుర్కొని 26 పరుగులు చేశాడు.
రెండో టెస్టు- స్కోర్లు:
►ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 473-9 డిక్లేర్డ్
►రెండో ఇన్నింగ్స్: 230-9 డిక్లేర్డ్
►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 236-10 ఆలౌట్
►రెండో ఇన్నింగ్స్: 192 ఆలౌట్