Friday, November 22, 2024

Banking: క్రెడిట్ వినియోగ‌దారుల‌కు అప్‌డేట్‌.. రేప‌టి నుంచి కొత్త‌రూల్స్ అమ‌ల్లోకి

బ్యాంకింగ్ రంగంలో అతి ముఖ్య‌మైన విష‌యం ఒక‌టుంది. ప్ర‌ధానంగా క్రెడిట్ కార్టుల విషయంలో ఆర్బీఐ కొత్త రూల్స్ ప్ర‌వేశ‌పెట్టింది. అవి జూన్ 1వ తేదీ అంటే రేప‌టి నుంచి అమ‌లు కాబోతున్నాయి. అవేంటో చ‌దివి తెలుసుకుందాం..

మ‌న రోజువారీ జీవ‌నంలో బ్యాంకింగ్‌కు సంబంధించిన అప్‌డేట్స్ చాలా కీల‌కంగా మార‌నున్నాయి. బ్యాంకింగ్ రూల్స్ అండ్ గైడ్‌లైన్స్‌, ఏటీఎం లావాదేవీల విషయంలో కొత్త కొత్త నిబంధనలు వస్తుంటాయి. క్రెడిట్ కార్డుల విషయంలో కూడా ఆర్బీఐ కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనలు జూన్ 1వ తేదీ నుంచి అమల్లో రానున్నాయి. క్రెడిట్ కార్డు.. ఇప్పుడిది ఓ నిత్యావసరంగా మారుతున్న పరిస్థితి. షాపింగ్ కోసమో, ఇత‌ర అత్యవరాల కోసమో ఉపయోగంగా ఉంటుంది. ఏ మాత్రం అవగాహన లేకపోయినా చార్జీల భారం మోయాల్సి ఉంటుంది. అందుకే వినియోగదారుల అవగాహన కోసం అటు ఆర్బీఐ కూడా సంబంధిత బ్యాంకులకు సూచనలు జారీ చేస్తోంది. ఇందులో భాగంగానే క్రెడిట్ కార్డు విషయంలో కొత్తగా కొన్ని రూల్స్ ప్ర‌వేశ‌పెట్టింది ఆర్‌బీఐ

వివిధ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు క్రెడిట్ కార్డుల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని సూచనలు జారీ చేసింది. కార్డు నిర్వహణలో లోపాలపై జవాబుదారీతనం ఉండాల‌నే బాధ్యతను గుర్తు చేసింది. కార్డును మార్చడం లేదా పరిమితి పెంచే విషయంలో వినియోగదారుడి అనుమతి తప్పనిసరిగా ఉండాల‌ని రూల్స్ పెట్టింది. వినియోగదారుడికి తెలియకుండా పరిమితి పెంచి..చార్జీలు విధించేందుకు వీల్లేదని తేల్చి చెప్పేసింది ఆర్‌బీఐ. అలా చేస్తే విధించిన చార్జీలకు రెట్టింపు మొత్తాన్ని ఆయా బ్యాంకులే చెల్లించాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించింది.

అంతేకాకుండా మరోవైపు క్రెడిట్ కార్డు కనీస మొత్తం చెల్లించే విషయమై అవగాహన కల్పించాలని కూడా బ్యాంకుల‌కు ఆర్‌బీఐ గ‌ట్టిగా తెలియ‌జేసింది. కనీస మొత్తం అంటే మినిమమ్ బిల్లు చెల్లించడం ద్వారా పూర్తి బకాయి తీరేందుకు చాలా కాలం పడుతుందని.. అధిక వడ్డీ భారమ‌వుతుంద‌ని వినియోగదారుడికి అర్ధమయ్యేలా, బిల్లుపై స్పష్ట‌త వ‌చ్చేలా చెప్పాల్సి ఉంటుంది. ఇక .. క్రెడిట్ కార్డు దరఖాస్తుకు సంబంధిత బ్యాంకు తిరస్కరిస్తే ఎందుకు తిరస్కరించారనేది రాతపూర్వకంగా దరఖాస్తుదారునికి తెలియజేయాల్సి ఉంటుంది. కార్డు పోయినప్పుడు జరిగే అనధికార లావాదేవీల నష్టాన్ని భర్తీ చేసేందుకు ఇకపై బీమా పాలసీ పొందవచ్చు.

- Advertisement -

తద్వారా బ్యాంకుకు, వినియోగదారుడికి నష్టం ఉండదు. వినియోగదారుడు ఎవరైనా కార్డు రద్దు చేయాలనుకుంటే..ఆ ప్రక్రియను ఏడు రోజుల్లోగా పూర్తి చేయాలి. లేకపోతే 500 వరకూ జరిమానా తప్పదు. కార్డు ఏడాదిపాటు వినియోగించకపోతే.. నెల రోజుల నోటీసుతో ఆ కార్డు రద్దు చేసే అధికారం సంబంధిత బ్యాంకులకు ఉంటుంది. అదే సమయంలో కార్డు జారీ చేసిన నెలరోజుల్లోగా ఓటీపీ ద్వారా యాక్టివేట్ చేసుకోవల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement