నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కామ్రేడ్లు యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈనెల 17న పోలింగ్ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతివ్వాలని సీపీఎం, సీపీఐ పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. వాస్తవానికి ఈ ఉప ఎన్నికలో తమకే మద్దతివ్వాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం స్వయంగా కమ్యూనిస్టులను కోరింది. కానీ కామ్రేడ్ల మనసు మాత్రం కారు పార్టీవైపు లాగుతున్నట్టు కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయడమే ప్రస్తుతం వామపక్షాల విధానంగా ఉంది. ఆ లెక్కన నాగార్జున సాగర్‌లో బీజేపీని మినహాయిస్తే కామ్రేడ్లకు కాంగ్రెస్ లేదా టీఆర్ఎస్‌లో ఏదో ఒక పార్టీకి మద్దతు తెలిపేందుకు అవకాశం ఉంది. అయితే వామపక్ష నేతలు మాత్రం టీఆర్‌ఎస్ అభ్యర్థి భగత్‌కు మద్దతివ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన చేయకుండా, బహిరంగంగా ప్రకటించకుండా ఓట్లు మాత్రం టీఆర్ఎస్ పార్టీకి బదలాయించాలని, తమ మద్దతుదారులు కారు గుర్తుకు ఓటు వేయాలని పార్టీ శ్రేణులు, సానుభూతిపరులకు అంతర్గతంగా సమాచారం ఇవ్వాలని సీపీఐ, సీపీఎం నాయకత్వాలు భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement