Tuesday, November 26, 2024

ముగిసిన సీపీఎం కేంద్ర క‌మిటీ స‌మావేశాలు – సీతారాం ఏచూరి ఏమ‌న్నారంటే


ఎల‌క్ష‌న్ ఫ‌లితాల త‌ర్వాత ఫ్రంట్ లు అత్యుత్త‌మ ఫ‌లితాలు ఇచ్చాయ‌ని సీపీఎం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి తెలిపారు. 1996నుండి 2004వ‌ర‌కు ఏర్ప‌డిన ఫ్రంట్ ల గురించి సీతారం ఏచూరి చెప్పారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను నిష్ప‌క్ష‌పాతంగా నిర్వ‌హించాల‌ని ఈసీని కోరారు. సీపీఎం కేంద్ర క‌మిటీ స‌మావేశాలు ముగిశాయి. ఈ సమావేశాల్లో సీపీఎం దేశంలోని రాజకీయ పరిస్థితులతో పాటు ఐదు రాస్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసించాల్సిన వ్యూహంపై చర్చించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా పెట్రోల్, డీజీల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయ‌న్నారు.

దీంతో ప్రజలంతా బీజేపీకి వ్యతిరేకంగా తమ ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం ఉందని సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం ఇచ్చిన అధికారం మేరకు దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలను నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని ఏచూరి కోరారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఈ మేర‌కు ఎల‌క్ష‌న్ కోడ్ ని ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షించాలని కూడా సీతారాం ఏచూరి ఈసీని డిమాండ్ చేశారు. డబ్బును ఉపయోగించుకొంటూ నిష్ఫక్షపాతంగా ఎన్నికలు జరగకుండా బీజేపీ అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి విమర్శించారు.మూడు రోజుల పాటు నిర్వహించిన కేంద్ర కమటీ సమావేశాల్లో 23 రాజకీయ తీర్మానాలను ఆమోదించామని సీతారాం ఏచూరి చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement