Friday, November 22, 2024

SPL STORY – గులాబీ ద‌ళంలో ఎర్ర గులాబీలు….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలో రాజకీయ వేడి కొనసాగుతున్న క్రమంలో ఓటర్లకు దగ్గరయ్యే ప్రత్నామ్నాయ మార్గాలపై బీఆర్‌ఎస్‌ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. దాదాపు మూడు నెలల క్రితమే మద్దతిచ్చేందుకు ముందుకు వచ్చిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో మరింత సఖ్యతగా ఉండి ఎన్నికల్లో విజయావకాశాలను బలపరుచుకోవాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎంతలేదన్నా గ్రామస్థాయిలో 10నుంచి 15శాతం పక్కా ఓటర్లను కలిగివున్న సీపీఐ, సీపీఎం పార్టీలతో పొత్త పెట్టుకోవడం ద్వారా తక్కువ మెజారిటీతో గెలిచే అసెంబ్లి స్థానాలను పదిలం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో కమ్యూనిస్టు భావజాలంతో ఉన్న పక్కా ఓట్ల ద్వారా ప్రతిపక్షాలు రాజకీయంగా లాభపడకుండా చేయాలన్న వ్యూహం కూడా కనిపిస్తోంది. ఎన్నికలకు సమయం దగ్గపపడు తున్న నేపథ్యంలో ఈ సారి బలమైన త్రిముఖ పోటీ తప్పదన్న సంకేతాలు కనిపిస్తుండడంతో బీఆర్‌ఎస్‌ ఎన్నికల వ్యూహంపై పార్టీ చీఫ్‌ ఒక అడుగు ముందుకు వేసి పొత్తులపై సానుకూల వైఖరినిప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీట్ల సర్ధు బాటు అంశంపై ఉభయ క్యూనిస్టు పార్టీలకు చెందిన ముఖ్య నేత లతో త్వరలోనే చర్చలు జరిపేందుకు సీఎం కేసీఆర్‌ అంగీకారం తెలిపినట్లు విశ్వసనీయంగా సమాచారం అందింది. ఈ నెలా ఖరులోనే వారిని సమావేశానికి ఆహ్వానించే అవకాశం ఉంది.

గులాబీ దళపతితో సమావేశానికి పిలుస్తారన్న సమా చారం అందుకున్న ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు సానుకూల వాతావరణంలో సమాలోచన చేసేందుకు సింసిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పొత్తు అంశంతో పాటు అసెంబ్లి సెగ్మెంట్ల సర్దుబాటుపై కూడా ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆయా పార్టీల అధినేతలతో సీఎం కేసీఆర్‌ చరవాణి చర్యలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అలాగే సర్డుకుపోయే ధోరణితో చేతులు కలపాలనుకుంటున్న ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ప్రత్యర్థి పార్టీల వ్యూహాన్ని క్షేత్రస్థాయిలో దెబ్బకొట్టేందుకు వ్యూహాలను రచిస్తున్నాయి.

కాంగ్రెస్‌, కాషాయ దళంతో ఇమడలేక ఉద్యమ భావజాలం గల పార్టీ బీఆర్‌ఎస్‌తో రాజీపడడమే న్యాయమన్న వాదనతో ఆ పార్టీల నేతలు ఏకీభవిస్తున్నారు. పొత్తు అంశంపై ఇటీవల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేనికి సీఎం కేసీఆర్‌ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సర్వే రిపోర్టులు చూపి ఆయా స్థానాల్లో గెలుపు కష్టమని వివరిస్తూ సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులకు కేసీఆర్‌ ఎమ్మెల్సీ అవకాశాన్ని ఆఫర్‌ చేసినట్టు- అత్యంత వివ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా స్వత్రంత్రంగా పోటీ- చేసే ఆలోచనను విరమించుకోవాలని సూచించినట్టు- సమాచారం. వామపక్షాలు సైతం ఇచ్చినన్ని సీట్లు- తీసుకుని, బీఆర్‌ఎస్‌తో పొత్తుతోనే ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నాయి.

కేసీఆర్‌ సీక్రెట్‌ సర్వే ఆధారంగా సీట్ల కేటాయింపుల్లో ప్రాధాన్యత
త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సీపీఐ, సీపీఎంలు ఎక్కడెక్కడ పోటీ- చేయాలో దాదాపుగా నిర్ణయానికి వచ్చాయి. ఖమ్మం జిల్లా నుంచి రెండు పార్టీలు ఐదు సీట్లను ఆశిస్తున్నాయి. వీటిలో ఖమ్మం జిల్లా భద్రాచలం, వైరా, కొత్తగూడెం స్థానాలను సీపీఐ, ఖమ్మం, పాలేరు నియోజక వర్గాలను సీపీఎం కోరుతున్నది. అయితే బీఆర్‌ఎస్‌ మాత్రం రెండు లెప్ట్‌n పార్టీల కార్యదర్శులకు మాత్రం ఎమ్మెల్సీపై హామీ ఇచ్చింది. రాష్ట్రంలో ఏయే స్థానాల్లో ఈ రెండు పార్టీలకు ఎంత బలం ఉన్నది, విజయావకాశాలు ఏ మేరకు ఉన్నాయనే దానిపై ఇప్పటికే బీఆర్‌ఎస్‌ వేర్వేరుగా రెండు సర్వే రిపోర్టులను తెప్పించుకున్నది. పోటీ- చేస్తే గెలవడం కష్టమేనని ఆ సర్వే రిపోర్టుల ద్వారా వెల్లడైన వివరాలను కేసీఆర్‌ వారికే పంపించి అర్థమయ్యేలా చేసినట్లు తెలిసింది.

- Advertisement -

అయితే ఈ ప్రతిపాదనలపై ఒకరు సంతృప్తి వ్యక్తం చేసినా మరొకరు మాత్రం ఆలోచించిన తర్వాత రిప్లయ్‌ ఇస్తానంటూ కేసీఆర్‌కు మధ్యవర్తి ద్వారా సమాచారం పంపించారు. తాజాగా ఢిల్లిd పెద్దల సూచనలతో ఉభయ పార్టీల రాష్ట్ర బాధ్యులు అంగీకారం కూడా తెలిపినట్లు సమాచారం. రాష్ట్ర కార్యదర్శులుగా ఉన్న వీరిద్దరూ ఎన్నికల్లో పోటీ- చేస్తే రాష్ట్రమంతా ఆ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి సమయాన్ని ఎలా వెచ్చిస్తారన్న అంశాన్ని గతంలోనే గులాబీ బాస్‌ వారి దగ్గర ప్రస్తావించారు. ఈ రెండు పార్టీలకు ఎక్కడెక్కడ అవకాశం కల్పంచాలన్నదానిపై ఎన్నికల షెడ్యూలు సమయానికి క్లారిటీ-కి రావచ్చని సూచించి ప్రస్తుతానికి ఎమ్మెల్సీ అంశంపై స్పష్టత ఇచ్చినట్లు- సమాచారం అందింది.

ఆయా సెగ్మెంట్లలో పోటీతత్వాన్ని బట్టి సీట్ల సర్దుబాటు
రాష్ట్రంలో కమ్యూనిస్టులు బలంగా ఉన్న స్థానాలను గుర్తించి, ఆయా సెగ్మెంట్లలో పోటీతత్వాన్ని బట్టి సీట్లు సర్దుబాటు చేయనున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం లేదా పాలేరు నుంచి పోటీ- చేయాలనుకుంటు-న్నారు. ఇప్పటికే ఆ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌లతో పాటు- గతంలో పోటీ-చేసి ఓడిపోయిన వారు క్యూలో ఉన్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌, పాలేరులో కాంగ్రెస్‌ తరఫున గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరిన కందాళ ఉపేందర్‌ రెడ్డి, ఓడిపోయిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈసారి రేసులో ఉన్నారు. వీరిని కాదని తమ్మినేనికి టికెట్‌ ఇచ్చే అవకాశాలు తక్కువేనని బీఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం నుంచి కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని హుస్నాబాద్‌ నుంచి ఆ పార్టీ మాజీ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పోటీ- చేయాలనుకుంటు-న్నారు. వీరిద్దరి విషయంలో సైతం గెలుపు అవకాశాలను గులాబీ బాస్‌ వారికి లెక్కలతో సహా సర్వే రిపోర్టును పంపినట్లు- తెలిసింది. కూనంనేనికి కూడా ఎమ్మెల్సీ చాన్స్‌ ఇస్తానని బీఆర్‌ఎస్‌ నుంచి సిగ్నల్‌ వెళ్లడంతో ఎలాంటి రిప్లయ్‌ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ స్థానంలో సిట్టింగ్‌ వనమా వెంకటశ్వరరావు, ఆ పార్టీకి చెందిన జలగం వెంకట్రావు, కొత్తగా ఆశిస్తున్న రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు వారివారి ప్రయత్నాల్లో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో వైరా, భద్రాచలం స్థానాలను కూడా సీపీఐ కోరుతున్నది. వైరా స్థానంలో గతంలో సీపీఐ తరఫున విజయాబాయి పోటీ- చేసి ఓడిపోయారు. భద్రాచలం స్థానం కాంగ్రెస్‌ చేతిలో ఉంది. ఆశావహులు అనేకంగా కనిపిస్తున్నప్పటికీ, వారి చరిత్ర, గెలుపు అవకాశాల ఆధారంగా సీట్లు కేటాయించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement