Monday, November 25, 2024

బిగ్ బాస్ షో లైసెన్స్ వ్యభిచారం లాంటిది: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్య

తెలుగు రియాల్టీ బాగ్ బాస్ షోపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ షో అనేది లైసెన్స్ వ్యభిచారం లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. యువతీ, యువకుల్ని పెట్టి బ్రోతల్ హౌస్ నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. తాను ఫిర్యాదు చేసిన తర్వాత లైవ్ కెమెరాలు పెడుతున్నారని అన్నారు. కెమెరాలు కంటపడకుండా ఏమైనా చేయచ్చు కదా ?నారాయణ ప్రశ్నించారు. బిగ్ బాస్ షోకు నాగార్జున హోస్ట్ గా ఉండడం బాధాకరం అని అన్నారు. బిగ్ బాస్ షోపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నామని చెప్పారు. క్లీన్ ఎంటర్ టైన్మెంట్ పేరుతో యాప్ విడుదల చేస్తామన్నారు. సినిమా టికెట్ ధరలు తగ్గించడమన్నది సరైన చర్యే అని పేర్కొన్నారు. సినీ అసోసియేషన్ తో మాట్లాడి ఉంటే సమస్య వచ్చేది కాదన్నారు. వివేకాహత్యపై విచారణ అవసరం లేదని,నిందితులు బయటపడ్డారని చెప్పారు. సీఎం జగన్ కుటుంబం నైతిక బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పుడు సీబీఐపై కూడా ఎందుకు దాడి చేస్తున్నారని నారాయణ నిలదీశారు. 2 నెలల నుంచి యుద్ధం జరుగుతుందని తెలిసినా.. భారత ప్రభుత్వం అప్రమత్తం కాలేదన్నారు. అసలు విదేశాంగశాఖ పనిచేస్తోందా? అని నారాయణ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement