పెద్ద పెద్ద సిటీస్‌లో ఉండే హైక్లాస్ పీపుల్స్‌తో పాటు ఫారెన్‌లో ఉండే ఇండియన్స్ కోసం అమెజాన్ (ఈకామర్స్ సంస్థ) పిడకలను అమ్మే పని పెట్టుకుంది. సాధారణంగా ఈ పిడకలను పండుగల సమయంలో వాడతారు. ఎక్కువగా భోగి పండుగనాడు పిడకలతో వేసే భోగి మంటలకు ఉపయోగిస్తారు. అయితే.. ‘‘కౌ డంగ్ కేక్స్’’ పేరిట అమెజాన్ ఈ కామర్స్ కంపెనీ ఆన్లైన్లో పిడకలను అమ్మకానికి పెట్టింది. వీటి ధర కూడా నిర్ణయించి ఈజీగా కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. ఆ మేరకు సప్లయ్ కూడా చేస్తోంది.
అయితే.. కౌ డంగ్ కేక్స్‌ని తినే పదార్థంగా భావించిన ఓ ఫారెనర్ చాలా బాగుంటాయి, స్వీట్స్ కావచ్చు అనుకుని కొనుగోలు చేశాడు. ఆర్డర్ పెట్టిన కొద్ది రోజులకు అతనికి పార్సెల్ డెలివరీ వచ్చింది. దీంతో సంబురపడ్డ ఆ విదేశీయుడు వాటిని ఎంతో ఇష్టంగా తిన్నాడు. దీంతో అతనికి అవి టేస్టీగా అనిపించలేదు. పైగా క్రంచీగా కూడా లేవు. అంతేకాకుండా అంతా మట్టి, గడ్డిపోచలతో ఏదోలా ఉండడంతో అమెజాన్లోనే దానికి సంబంధించిన రివ్యూ కూడా పోస్టు చేశారు..
‘‘ఇదేం రుచి అస్సలు బాగా లేదు. అంతా మట్టి, గడ్డి ఉంది. పైగా శుభ్రత(హైజీన్) కూడా లేదు. ఇక.. క్రంచీగా కూడా లేవు. ఈ కేక్స్ ఇంకా బాగుండేలా చేయండి. కాస్త శుభ్రత పాటిస్తూ.. టేస్టీగా, క్రంచీగా ఉండేలా చేస్తే మరోసారి కొనుగోలు చేస్తా” అని చిరాకుగా రివ్యూ రాసేశాడు.