Saturday, November 23, 2024

కోవిషీల్డ్ వ్యాక్సిన్ సామర్థ్యం 65 నుంచి 88 శాతానికి పెరుగుతుంది..

కోవీషీల్డ్ టీకాల‌పైరెండు డోసుల మ‌ధ్య వ్య‌వ‌ధిని 12 వారాల‌కు పెంచితే, అప్పుడు వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 65 శాతం నుంచి 88 శాతానికి పెరిగిన‌ట్లు బ్రిటన్ లోని డాక్ట‌ర్ అరోరా తెలిపారు. బ్రిటన్ లోని ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించిన డేటా ఆధారంగా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయన అన్నారు. ఆల్ఫా వేరియంట్ ఉదృతంగా ఉన్న స‌మ‌యంలో బ్రిట‌న్ చేప‌ట్టిన స‌ర్వే వివ‌రాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. ఆ స‌మ‌యంలో టీకాల మ‌ధ్య వ్య‌వ‌ధిని 12 వారాల ఉంచ‌డం వ‌ల్ల ఆల్ఫా వేరియంట్‌ను సులువుగా ఎదుర్కొన్న‌ట్లు బ్రిట‌న్ త‌న స్ట‌డీలో తెలిపిందన్నారు. ఆ ఐడియా బాగుంద‌ని, వ్య‌వ‌ధిని పెంచ‌డం వ‌ల్ల అడినోవెక్ట‌ర్ వ్యాక్సిన్ల ప్ర‌తిస్పంద‌న పెరుగుతంద‌ని గ్ర‌హించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. రెండు డోసుల మ‌ధ్య గ్యాప్‌ను పెంచే అంశంలో కోవిడ్ వ‌ర్కింగ్ గ్రూపులో ఎటువంటి విభేదాలు త‌లెత్త‌లేద‌ని అరోరా చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement