దేశంలో ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నా.. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్‌ను 6 నుంచి 8 వారాల వరకు పెంచాలంటూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. అయితే, కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. కొవాగ్జిన్‌ను యథాతథంగా వేయాలని పేర్కొంది.
ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం ప్రకారం.. వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు వేస్తున్నారు. అంటే.. 4 నుంచి 6 వారాల మధ్య రెండో డోసు అందిస్తున్నారు. దీంతో వ్యాక్సిన్ సెకండ్ డోసు గ్యాప్‌ను 28 రోజుల నుంచి 6 నుంచి 8 వారాలకు పెంచాలని సూచించింది.