దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న వేళ.. మహమ్మారి కొత్త రూపాల్లో విరుచుకుపడుతోంది. తాజాగా ఒమిక్రాన్ కంటే అత్యంత వేగంగా వ్యాప్తిచెందే హైబ్రిడ్ వేరియంట్ XE దేశంలోకి అడుగుపెట్టింది. గుజరాత్‌లో కొత్తరకం వేరియంట్ XE కేసు నమోదయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే XM వేరియంట్ కేసు ఆ రాష్ట్రంలో నమోదయినట్టు పేర్కొన్నారు. అయితే, ఇద్దరు రోగులకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. రెండు రోజుల కిందట ముంబయిలో XE వేరియంట్ కేసు నమోదయినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, దీనిని కేంద్ర ఆరోగ్య శాఖ తోసిపుచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఆమెలో గుర్తించిన వేరియంట్‌తో XE జన్యువులకు సంబంధం లేదని పేర్కొంది. XE పాజిటివ్ వచ్చిన వ్యక్తి గురించి అదనపు వివరాలను వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement