దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. అదేసమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా పెద్దలకు మాత్రమే వ్యాక్సిన్ వేసిన ప్రభుత్వం.. ఇటీవలే 15- 18 ఏళ్ల వయసు పిల్లలకు కూడా వ్యాక్సిన్లను వేసింది. తాజాగా 12- 14 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు కూడా వ్యాక్సినేషన్‌కు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఈ నెల 16 (బుధవారం) నుంచే ఈ వయసు పిల్లలకు వ్యాక్సిన్లు వేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 12-14 ఏళ్ల మధ్య పిల్లలతో పాటు 60 ఏళ్లకు పైబడిన వాళ్లకు ప్రికాషన్ డోసు ప్రక్రియ మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మాన్షుక్ మాండవీయా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Covid vaccination: కరోనా కట్టడిలో మరో ముందడుగు.. 12- 14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్
Advertisement
తాజా వార్తలు
Advertisement