పూరీ జగన్నాథుడిని దర్శించుకునేందుకు రెండేళ్ల తర్వాత మొదటిసారి భక్తులకు అనుమతించారు. కరోనా ఆంక్షల సడలింపుతో స్వామిని చూసి.. మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. కాగా, ఈనెల 21వ తేదీ నుంచి భక్తులకు అనుమతి ఇస్తున్నామని, ఎలాంటి కరోనా ధ్రువీకరణ పత్రాలు లేకుండా హ్యాపీగా స్వామివారిని దర్శించుకోవచ్చ ఆలయ అధికారులు తెలిపారు. అయితే.. ఈనెల 19వ తేదీన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జగన్నాథుడిని దర్శించుకునేందుకు వస్తున్నారు. కాగా, ఈ పర్యటనకు ముందు ఏర్పాట్లపై చర్చించేందుకు SJTA చీఫ్ అడ్మినిస్ట్రేటర్ క్రిషన్ కుమార్, హాజరైన ఛతీసా నిజోగ్ (ఆలయ సేవా సంస్థల అపెక్స్ బాడీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈనెల 21వ తేదీ నుంచి జగన్నాథుడిని దర్శించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఆర్టీపీసీఆర్ రిపోర్టు కానీ, డబుల్-డోస్ టీకా సర్టిఫికేట్ కానీ తీసుకు రావాల్సిన అవసరం లేదని ఆలయ అధికారి క్రిషన్ కుమార్ తెలిపారు. కొవిడ్ -19 రోజువారీ కేసులు గణనీయంగా తగ్గినందున భక్తులకు ఈ నిబంధనలను తొలగించాలని ఛతీసా నిజోగ్ నిర్ణయించిందని ఆయన అన్నారు. అయితే.. ఆలయానికి వచ్చే భక్తులు తమ సేఫ్టీ, ఇతరుల భద్రత కోసం పూర్తిగా టీకాలు వేసుకుని ఉంటేని మంచిదని, అదేవిధంగా శానిటైజర్, మాస్క్ ల వాడకం కంపల్సరీ అన్నారు.
ఫిబ్రవరి 19న జగన్నాథ ఆలయాన్ని సందర్శించనున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జగన్నాథ ఆలయాన్ని సందర్శనున్న నేపథ్యంలో ఫిబ్రవరి 19వ తేదీ సాయంత్రం 4గంటల నుంచి 6 గంటల వరకు దర్శనానికి సాధారణ ప్రజలను అనుమతించడం లేదన్నారు ఆలయ అధికారులు. జగన్నాథ దర్శనంతో పాటు, గౌడియా మిషన్ వ్యవస్థాపకుడు శ్రీమద్ భక్తి సిద్ధాంత్ సరస్వతీ గోస్వామి ప్రభుపాద 150వ జయంతి ఉత్సవాలను ఫిబ్రవరి 20న రాష్ట్రపతి ప్రారంభించనున్నట్టు తెలిపారు. రాష్ట్రపతి తిరిగి ఢిల్లీకి వెళ్లే ముందు శ్రీ చైతన్య గౌడియ మఠంలో జరిగే కార్యక్రమానికి కూడా హాజరు కానున్నారు.