దేశంలో 15-18 ఏళ్ల వయసు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ప్రారభమైంది. కొవిన్ యాప్, వెబ్ సైట్లో రిజిస్ట్రర్ చేసుకున్న వారికి వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకాలు ఇస్తున్నారు. ఇప్పటికే కొవిన్ పోర్టల్‌లో 6 లక్షలకు పైగా పిల్లలు తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు.
ప్రస్తుతం కొవాగ్జిన్ టీకా మాత్రమే పిల్లలకు అందుబాటులో ఉంది. పెద్దలకు ఇచ్చినట్లుగానే 0.5 ఎంఎల్ చొప్పున టీకా ఇస్తున్నారు. పిల్లకు కూడా రెండు డోసుల్లోనే టీకా ఇవ్వనున్నారు. రెండు డోసుల మధ్య కనీసం 4 వారాల గడువు విధించారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 15-18 ఏళ్ల వయసు ఉన్న వారికి వ్యాక్సినేషన్ కోసం జనవరి 1నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆధార్ కార్డు లేని పిల్లలు స్టూడెంట్ ఐడీ కార్డు లేదా జనన ధృవీకరణ పత్రంతో నమోదు చేసుకోవచ్చని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది.
మరోవైపు జనవరి 10 నుంచి ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ప్రికాషన్ డోసును పంపిణీ చేయనున్నారు. అయితే, ప్రిఖాషన్ డోసుగా ఏ వ్యాక్సిన్ వేస్తారన్నది మాత్రం కేంద్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital