బాలీవుడ్ నటి, అందాల తార దీపికా పదుకొణె ఈరోజు (జనవరి 5న) తన పుట్టినరోజు జరుపుకుంటోంది. అయితే తన బర్త్ డే సందర్భంగా గెహ్రైయాన్ ట్రైలర్ను లాంచ్ చేయాలని ప్లాన్ చేశారుమూవీ మేకర్స్. కానీ, ముంబయిలో పెరుగుతున్న కొవిడ్ -19 కేసుల కారణంగా ఈ ప్రోగ్రామ్ ఆపేస్తున్నట్టు తెలిపారు. గెహ్రైయాన్ మూవీలో దీపికా పదుకొణెతో పాటు అనన్య పాండే, సిద్ధాంత్ చతుర్వేది నటించారు.
‘‘దీపికా పుట్టినరోజు సందర్భంగా అలీబాగ్ లో ఓ ఈవెంట్ ని ప్లాన్ చేశాం. ఈ కార్యక్రమంలోనే మూవీ మేకర్స్ గెహ్రైయాన్ ట్రైలర్ ని లాంచ్ చేయాలని అనుకున్నారు. అయితే.. ఇప్పుడు కరోనా కేసుల కారణంగా ఆ ఈవెంట్ రద్దు చేశారు. దీనికి బదులుగా సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్లను మాత్రమే మూవీ టీమ్ షేర్ చేసింది. ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకు దీపికా చాలా బాధపడ్డారు. గెహ్రైయాన్ మూవీ ఆమె మనసుకు నచ్చింది. ఈ వీడియో విడుదల చేయాలని, మీడియాతో మాట్లాడాలని దీపికా చాలా ఎక్సైటింగ్ ఉన్నారు.’’ అని మూవీ టీమ్ లోని ఒకరు తెలిపారు.
కానీ, తాము అనుకున్న ప్లాన్ అంతా తలకిందులైందని, పెరుగుతున్న కొవిడ్ కేసుల కారణంగా గెహ్రాయాన్ మాత్రమే కాదు, ముంబైలో చాలా ఇతర బాలీవుడ్ ఈవెంట్లు కూడా పోస్ట్ పోన్ అవుతున్నాయని తెలిపారు మూవీ మేకర్స్.. పుష్ప సినిమా విజయం తర్వాత హీరో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడానికి ముంబైకి రావడం పెద్ద సంచలనమే.. కానీ, అది కూడా ప్రస్తుతానికి రద్దయినట్టు బీ టౌన్ వర్గాలు తెలిపాయి.