Friday, November 22, 2024

‘కోవాగ్జిన్’తో అన్ని వేరియంట్లు నిర్వీర్యం: ఐసీఎంఆర్‌

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీస‌ర్చ్‌(ఐసీఎంఆర్‌) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌కు చెందిన కోవాగ్జిన్ టీకా.. అన్ని క‌రోనా వేరియంట్ల‌పై స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుంద‌ని వెల్లడించింది. సార్స్  సీవొవీ2 క‌రోనా వైర‌స్‌ కు చెందిన అన్ని ర‌కాల వేరియంట్ల‌ను స‌మూలంగా రూపుమాపుతుంద‌ని తెలింది. క‌రోనాకు చెందిన డ‌బుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ల‌ను కూడా అత్యంత క‌చ్చిత‌త్వంతో కోవాగ్జిన్ టీకా నాశ‌నం చేస్తుంద‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి స్ప‌ష్టం చేసింది.

సార్స్ సీవోవీ2కు చెందిన అన్ని వేరియంట్ల‌ను ప్ర‌త్యేకంగా క‌ల్చ‌ర్ చేసి వాటిని అధ్య‌య‌నం చేసిన‌ట్లు ఐసీఎంఆర్ తెలిపింది. నేష‌న‌ల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీతో క‌లిసి ఈ అధ్య‌య‌నం జ‌రిగిన‌ట్లు వెల్లడించింది. యూకే వేరియంట్ B.1.1.7, బ్రెజిల్ వేరియంట్ B.1.1.28, సౌతాఫ్రికా వేరియంట్ B.1.351ను అత్యంత విజ‌య‌వంతంగా స్ట‌డీ చేసిన‌ట్లు ఐసీఎంఆర్ తెలిపింది. భార‌త్‌ బ‌యోటెక్‌ కు చెందిన కోవాగ్జిన్ టీకాలో ఈ వేరియంట్ల‌ను నాశ‌నం చేసే స‌త్తా ఉన్న‌ట్లు నిర్ధార‌ణ అయిన‌ట్లు స్పష్టం చేసింది.

కాగా, ప్రస్తుతం భారత్ తో రెండు రకాల టీకాలు వినియోగంలోకి వచ్చాయి. భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’ , సీరమ్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ఇండియా (SII) అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ లను ప్రజలకు వేస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దశల వారీగా దేశ ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. తర్వలో 18 ఏళ్లు దాటిన వారికి కూడా టీకాలు వేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement