Monday, November 25, 2024

Breaking: కరోనా వైరస్​కు నాసల్​ డ్రాప్స్​తో చెక్​​.. భారత్​ బయోటెక్​కు డీసీజీఐ పర్మిషన్​

భారత్​ బయోటెక్​ సంస్థకు డ్రగ్​ కంట్రోల్​ ఆఫ్​ ఇండియా మరో పర్మిషన్​ ఇచ్చింది. ఇప్పటికే కొవాక్సిన్​ రెండు డోసులు తీసుకున్న వ్యక్తులపై ఇంట్రానాసల్​ బూస్టర్​ డోస్​ ఫేజ్​ 3 క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహించడానికి ఈ పర్మిషన్స్​ ఇచ్చింది.  కాగా, దేశంలోని తొమ్మిది ప్రదేశాలలో ఈ ట్రయల్స్ నిర్వహించనున్నారు. మాస్ టీకా డ్రైవ్‌లలో భాగంగా ఇంట్రానాసల్ వ్యాక్సిన్ బూస్టర్‌గా నిర్వహించడం సులభం అవుతుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

ముక్కులో వేసుకునే డ్రాప్స్​ ఆధారంగా రూపొందించే ఈ వ్యాక్సిన్ ద్వారా ఎంతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని, వైరస్​ అటాక్​ చేసే ముక్కు ప్రదేశంలో నేరుగా డ్రాప్స్​ వేయడంతో– రోగనిరోధక ప్రతిస్పందనలను ప్రేరేపిస్తుందని నిపుణులు తెలిపారు.  కొవిడ్ -19 సంక్రమణ,  వ్యాప్తిని నిరోధించడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుందని భారత్ బయోటెక్ తెలిపింది. నాసికా వ్యాక్సిన్‌ను ఎంత సులభంగా నిర్వహించవచ్చో,  దానికి ఆరోగ్య కార్యకర్తల అవసరం కూడా ఉండదనే వాస్తవాన్ని  గుర్తించాలని వారు తెలిపారు.

హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీదారు గత నెలలో నాసికా వ్యాక్సిన్ యొక్క ఫేజ్​ 3 ట్రయల్స్ నిర్వహించడానికి డ్రగ్ రెగ్యులేటర్ అనుమతిని కోరింది. భారత్ బయోటెక్ యొక్క కొవాక్సిన్,  సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క కొవిషీల్డ్ మార్కెట్‌లో అమ్మకానికి అనుమతి పొందిన వెంటనే ఈ తాజా పర్మిషన్​ రావడం సంతోషించదగ్గ విషయం అని సంస్థ ప్రతినిధులు తెలిపారు.  అయితే, ఈ రెండు వ్యాక్సిన్‌లు త్వరలో మెడికల్​ షాపుల్లో కూడా అందుబాటులో ఉంటాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement